టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో విష్ణు మంచు టైటిల్ రోల్ పోషిస్తున్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్ ‘కన్నప్ప’. ‘మహాభారతం’ సీరియల్ ఫేమ్ ముఖేష్‌కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో పలువురు తెలుగు నటులే కాకుండా పలువురు తమిళ, కన్నడ, హిందీ నటీనటులు భాగం కానున్నారు. మోహన్‌లాల్, అక్షయ్ కుమార్, ప్రభాస్, శరత్ కుమార్ సహా భారీ తారాగణం నటిస్తోంది. అలాగే విష్ణు తనయుడు అవ్రామ్ మంచు తిన్నడు అనే పాత్రతో వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
హిస్టారికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పాన్ ఇండియా రెబల్ స్టార్ ప్రభాస్ ఓ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఆయన పాత్రకు సంబంధించిన స్టిల్ ఒకటి లీక్ అయింది. లీక్ అయిన ఈ ఫొటోలో ప్రభాస్ డిఫరెంట్ గెటప్‌లో కనిపిస్తున్నాడు. ఇందులో రింగులు తిరిగిన జుట్టుతో, నుదిటిన అడ్డంగా విభూది రేఖలతో, మధ్యలో పొడుగాటి నామంతో, మెడలో రుద్రాక్షలతో, చేతిలో పెద్ద కర్ర పట్టుకుని డివోషనల్ లుక్స్‌తో శివుడి భక్తుడిగా ప్రభాస్ కనిపిస్తున్నాడు.
దీంతో కన్నప్ప చిత్ర యూనిట్ ఈ వ్యవహారంపై సీరియస్ అయ్యింది. ఈ ఫొటో లీక్ చేసిన వారు ఎవరో తెలుసుకునేందుకు పోలీస్ కేసు పెట్టబోతున్నట్లు ప్రెస్ నోట్‌ని విడుదల చేసింది. ఈ సందర్భంగా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా పొలీసు శాఖను కోరింది. అలాగే వీరిని గుర్తించే విషయంలో సహకారం అందించాల్సిందిగా ప్రభాస్ అభిమానులకు విజ్ఞప్తి చేసింది. ఇక ఈ ఫొటో లీక్ చేసిన వారిని కనిపెడితే రూ.5 లక్షల బహుమానం ఇస్తామని కూడా ప్రకటించింది చిత్ర బృందం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: