గేమ్ ఛేంజర్ టీజర్ ప్రోమో చూశారా?

Game Changer Teaser to be Released Today in Lucknow

గ్లోబల్ స్టార్ రామ్‌ చ‌ర‌ణ్‌ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ‘గేమ్ ఛేంజర్’. ఆర్‌సీ15గా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. పొలిటికల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న ఈ సినిమాలో చ‌ర‌ణ్ ఇంతకుముందెన్నడూ కనిపించని పాత్రలో కనిపించనున్నాడు. దీంతో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పాన్ ఇండియా లెవెల్లో రూపొందుతోన్న ఈ సినిమాను శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యానర్‌పై దిల్ రాజు, శిరీష్‌లు అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 10న తెలుగు, తమిళం, హిందీ భాషల్లో గ్రాండ్‌గా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ప్రమోషనల్ కార్యక్రమాలను వేగవంతం చేశారు. దీనిలో భాగంగా ఇప్పటికే ఈ మూవీ నుంచి రెండు పాటలు రిలీజ్ చేయగా.. వాటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

త్వరలోనే థర్డ్ సింగిల్‌ కూడా విడుదలకానుంది. ఈ క్రమంలో చిత్ర బృందం ఈరోజు మెగా అభిమానులకు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనుంది. ఈ సాయంత్రం గేమ్ ఛేంజర్ టీజర్ విడుదల చేస్తోంది. ఇందుకోసం ఉత్తరప్రదేశ్ లోని లక్నో వేదికకానుంది. అయితే ప్రధానంగా లక్నోలో టీజర్‌ను రిలీజ్ చేస్తున్నప్పటికీ అదే సమయంలో మొత్తం 3 రాష్ట్రాల్లోని ఎంపిక చేసిన 11 థియేటర్లలో విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో నిన్న రిలీజ్ చేసిన టీజర్ ప్రోమో దుమ్ము రేపుతోంది.

ఇకఇదిలావుంటే, గ్లోబల్ స్టార్ నటించిన సినిమా టీజర్ విడుదలవుతోన్న సందర్భంగా మెగా ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత చరణ్ సోలో హీరోగా చేసిన చిత్రం ఇదే. దీంతో ఎప్పుడెప్పుడు ఆయనను బిగ్ స్క్రీన్ పై చూసేద్దామా అని వారు ఉత్సుకతగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈవెనింగ్ టీజర్ రిలీజ్ అయ్యాక వారి ఆనందానికి హద్దే ఉండదని అర్ధమవుతోంది.

అయితే ఇప్పటికే టీజర్‌ను చూసిన ఇండస్ట్రీకు చెందిన ప్రముఖులు కొందరు అదిరిపోయేలా ఉందని అంటున్నారు. టీజర్ వచ్చాక సినిమా పరిస్థితి మారుతుందని ఓ రేంజ్‌లో అంచనాలు పెంచేస్తున్నారు. శంకర్, రామ్ చరణ్‌ను ప్రజెంట్ చేసిన తీరుకు ఫిదా కావడమని ఖాయమని అంటున్నారు. మొత్తానికి ఈ టీజర్‌పై ఇటు ఇండస్ట్రీలో, అటు అభిమానుల్లో భారీ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. ఇక టీజర్ ఎలా ఉండనుందో మరికొన్ని గంటల్లోనే తెలిసిపోనుంది.

కాగా ఈ చిత్రంలో కియారా అద్వాణీ హీరోయిన్‌గా నటిస్తుండగా.. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, జయరామ్, స‌ముద్రఖని, సునీల్‌, అంజలి ఇతర ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. మ్యూజికల్ సెన్సేషన్ థమన్ సంగీతం అందిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు కథను కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజు అందించగా.. సాయిమాధ‌వ్ బుర్రా డైలాగ్స్ రాశారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.