ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న మచ్ అవైటెడ్ పాన్ ఇండియా ఫిల్మ్ ‘పుష్ప 2: ది రూల్’. ప్రస్తుతం చిత్రీకరణ చివరి దశలో ఉన్న ఈ చిత్రం త్వరలోనే గుమ్మడికాయ కొట్టనుంది. ఇంకో వారం రోజుల షూటింగ్ బ్యాలెన్స్ వుండగా.. స్పెషల్ సాంగ్ చిత్రీకరించే పనిలో బిజీగా ఉన్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇదిలావుంటే, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నెల 20న ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. త్వరలోనే ట్రైలర్‌ను కూడా రిలీజ్ చేయనున్నారు. ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది. థియేట్రికల్, నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1,000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.
ఈ నేపథ్యంలో ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అదరగొడుతుంది. ఇంకా మూవీ ట్రైలర్ కూడా రిలీజ్ కాకముందే యూఎస్ఏలో ఇప్పటివరకు ప్రీమియర్స్ ప్రీ సేల్స్ టికెట్స్ 20,000 వరకూ అమ్ముడయ్యాయి. వసూళ్ల పరంగా 500k డాలర్లను క్రాస్ చేసింది. తద్వారా విడుదలకు ఇంకా 28 రోజులు ఉండగానే ఫాస్ట్‌గా ఈ ఫీట్ సాధించిన తొలి చిత్రంగా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.
దీనిని బట్టి పుష్ప 2పై అక్కడ ఏ రేంజ్ క్రేజ్ వుందో ఈ బుకింగ్స్ చూస్తేనే అర్ధమవుతుంది. ఇదే జోరు కొనసాగితే అక్కడ కేవలం ప్రీమియర్స్ తోనే 2 మిలియన్ మార్క్‌ను అందుకోవచ్చని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో క్రేజీ అప్‌డేట్ వచ్చింది.
పుష్ప 2 రీసెంట్‌గా మరో రెండు దేశాల్లో అడ్వాన్స్ సేల్స్ ఓపెన్ అయ్యాయి. ఈ మేరకు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌లలో ప్రీ బుకింగ్స్ తెరవబడ్డాయని ప్రకటించింది. ఈ సందర్భంగా పుష్ప రాజ్ ట్రాన్స్-టాస్మాన్ రీజియన్‌ను స్వాధీనం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడని అందులో పేర్కొంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: