యంగ్ హీరో విశ్వక్ సేన్ టైటిల్ రోల్ లో నటించిన సినిమా మెకానిక్ రాకీ.యూత్ ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తుంది.ఈనెల 22న థియేటర్లలోకి రానుంది.రిలీజ్ డేట్ దగ్గరపడుతుండడంతో ప్రమోషన్ షెడ్యూల్ ను కూడా అనౌన్స్ చేశారు.అందులో భాగంగా ఈనెల 16న మీమర్స్ తో లంచ్ 17న ట్రైలర్ 2.0 రిలీజ్ అలాగే 18న తిరుమల దర్శనం ఆతరువాత కాలేజ్ విజిట్, 19న ప్రెస్ పార్టీ 20న ప్రీ రిలీజ్ ఈవెంట్, 21న ఏఎంబీ సినిమాస్ లో ప్రీమియర్, 22న సుదర్శన్ థియేటర్ లో ఫస్ట్ షో వీక్షించనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఈసినిమా నుండి రిలీజైన సాంగ్స్ కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి.రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను డైరెక్ట్ చేయగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రామ్ తాళ్లూరి నిర్మించాడు.
విశ్వక్ కు ఈ ఏడాది ఇది థర్డ్ రిలీజ్ ఇంతకుముందు గామీ ,గ్యాంగ్స్ ఆఫ్ గోదావరితో వచ్చాడు.ఇందులో గామి సూపర్ హిట్ అనిపించుకోగా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి నిరాశ పరిచింది.మరి మెకానిక్ రాకీ తో హిట్ కొట్టి విశ్వక్ ఫామ్ లోకి వస్తాడో చూడాలి.
ఇక ప్రస్తుతం విశ్వక్ సేన్, లైలా అనే సినిమా చేస్తున్నాడు.ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించనుండగా ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తుంది.రామ్ నారాయణ్ డైరెక్ట్ చేస్తున్నాడు.తనిష్క్ బాఘ్చి సంగీతం అందిస్తుండగా షైన్ స్క్రీన్స్ నిర్మిస్తుంది.వచ్చే ఏడాది ఫిబ్రవరి 14న విడుదలకానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























