యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో క సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది.
ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చిత్ర పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ మాట్లాడుతూ.. “కిరణ్ రాజావారు రాణిగారు సినిమా తర్వాత మళ్లీ క మూవీ ఫంక్షన్ కు వచ్చాను. తన కెరీర్ ను మొదటినుంచీ చూస్తున్నా. మంచి సక్సెస్ లు అందుకున్నాడు” అని తెలిపారు.
ఇంకా ఆయన మాట్లాడుతూ.. “మధ్యలో రెండు మూడు సినిమాలు పోయినప్పుడు చాలా కామెంట్స్ వచ్చాయి. ఒకరి ఫెయిల్యూర్‌ను ఇంతగా సంతోషపడతారా అనిపించింది. ఇలాంటి నెగిటివిటీని తట్టుకుని ఈరోజు క వంటి సూపర్ హిట్ సినిమా చేశాడు. ఈ సినిమాను ఎంతో ధైర్యంగా పండగకి రిలీజ్ చేసి ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లాడు” అని చెప్పారు.
“ఈరోజు కిరణ్ ను చూస్తుంటే గర్వంగా ఉంది. ఎంతోమందికి నువ్వు ఇన్సిపిరేషన్. ఈరోజు ప్రేక్షకులు మంచి సినిమా చేసిన వారిని తప్పకుండా ఆదిరస్తున్నారు. దర్శకులు సుజీత్, సందీప్ గురించి ప్రశంసలు వస్తున్నాయి. మీరిద్దరు రాజ్ డీకే అంత పేరు తెచ్చుకోవాలి. క టీమ్ అందరికీ నా కంగ్రాట్స్ చెబుతున్నా” అని అన్నారు హీరో సందీప్ కిషన్.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: