మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 షూటింగ్ తుది దశకు చేరుకుంది.అందులో భాగంగా ప్రస్తుతం స్పెషల్ సాంగ్ ను చిత్రీకరిస్తున్నారు.హీరో అల్లు అర్జున్ అలాగే యంగ్ సెన్సేషన్ శ్రీ లీల పై ఈసాంగ్ ను షూట్ చేస్తున్నారు.దీనికి సంబంధించిన స్టిల్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.ఇక ఫస్ట్ పార్ట్ లో సమంత స్పెషల్ సాంగ్ లో కనిపించగా ఆ సాంగ్ బ్లాక్ బాస్టర్ అయ్యింది.దాంతో పుష్ప 2 లో వచ్చే స్పెషల్ సాంగ్ పై భారీ అంచనాలు వున్నాయి.అయితే ఈ సాంగ్ ఆ హైప్ కు ఏ మాత్రం తగ్గకుండా ఉండనుందట.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
అటు పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా శరవేగంగా జరుగుతున్నాయి.ఈనెల నాలుగో వారంలో ఫస్ట్ కాపీ రెడీ కానుంది.ఇప్పటికే ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్ కూడా ఓపెన్ అయ్యాయి.వీటికి సూపర్ రెస్పాన్స్ వస్తుంది.త్వరలోనే ట్రైలర్ రానుంది.ఈసినిమాపై నేషన్ వైడ్ గా భారీ అంచనాలు వున్నాయి.ఈసినిమాకు పోటీగా ఏ సినిమా కూడా విడుదలకావడం లేదు.హిట్ టాక్ వస్తే మొదటి రోజే 300 కోట్ల మార్క్ ను టచ్ చేయనుంది.ఈసినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ 1000కోట్లు దాటింది.ఇప్పటివరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఇంత బిజినెస్ చేయలేదు.
సుకుమార్ ఈసినిమాను తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ ఈసినిమాను నిర్మిస్తున్నాయి.వచ్చే నెల 5న పుష్ప 2 ది రూల్ థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: