సంక్రాంతికి వస్తున్నాం ఫైనల్ షెడ్యూల్ షురూ

Sankranthiki Vasthunam final schedule begins

విక్టరీ వెంకటేష్ ,డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో సినిమా సంక్రాంతికి వస్తున్నాం.సెట్స్ మీదకు వెళ్ళనప్పటి నుండి నాన్ స్టాప్ షూటింగ్ జరుపుకుంటుంది.దాంతో అప్పుడే ఫైనల్ షెడ్యూల్ లోకి వచ్చేసింది.ఈరోజే చివరి షెడ్యూల్ అరకు లో ప్రారంభమైంది.వచ్చే వారం కల్లా షూటింగ్ కంప్లీట్ కానుంది.ఈ సందర్భంగా మేకర్స్ స్పెషల్ వీడియో ను రిలీజ్ చేశారు.అవుట్ అండ్ అవుట్ కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న సినిమాలో ఐశ్వర్య రాజేష్ ,మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.దిల్ రాజు ఈసినిమాను నిర్మిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

గతంలో వెంకీ ,అనిల్ ,దిల్ రాజు కాంబినేషన్ లో వచ్చిన ఎఫ్ 2, ఎఫ్ 3 బ్లాక్ బాస్టర్ అయ్యాయి.దాంతో సంక్రాంతికి వస్తున్నాంపై మంచి అంచనాలు వున్నాయి. మరి ఈ సినిమా వీరికి హ్యాట్రిక్ ఇస్తుందో చూడాలి.ఈసినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుంది.జనవరి 14న థియేటర్లలోకి తీసుకురావాలని చూస్తున్నారు.అయితే సంక్రాంతికి గేమ్ ఛేంజర్ ,NBK 109 వంటి పెద్ద సినిమాలు కూడా వస్తున్నాయి.దాంతో సంక్రాంతికి వస్తున్నాం గట్టి పోటీ ఎదురుకానుంది.

అయితే  ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా బరిలోకి దిగనుంది సంక్రాంతికి వస్తున్నాం.అటు ఇప్పటివరకు ఒక్క ఫ్లాప్ కూడా లేకుండా తన ట్రాక్ రికార్డు ను మెయిన్ టైన్ చేస్తున్నాడు అనిల్ రావిపూడి.ఇక ఈసంక్రాంతికి వస్తున్నాంతో తన సక్సెస్ స్ట్రీక్ ను కంటిన్యూ చేసేలానే వున్నాడు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.