క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా

Director Vassishta Says, He Also Waiting For KA2 Movie

యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లెటెస్ట్ మూవీ ‘క’ బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. దీపావళి విన్నర్ గా ఈ సినిమాను ట్రేడ్ వర్గాలు డిక్లేర్ చేస్తున్నాయి. ఈ సినిమాలో తన్వీరామ్, నయన్ సారిక హీరోయిన్స్ గా నటించారు. దర్శకద్వయం సుజీత్, సందీప్ ఈ సినిమాను రూపొందించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

శ్రీమతి చింతా వరలక్ష్మి సమర్పణలో శ్రీచక్రాస్ ఎంటర్ టైన్ మెంట్స్ తో బ్యానర్ పై చింతా గోపాలకృష్ణ రెడ్డి భారీ ప్రొడక్షన్ వ్యాల్యూస్ తో నిర్మించారు. తెలుగులో ప్రొడ్యూసర్ వంశీ నందిపాటి రిలీజ్ చేశారు. ఆడియెన్స్ నుంచి సూపర్బ్ రెస్పాన్స్ తో క సినిమా దిగ్విజయంగా రెండో వారంలోకి అడుగుపెడుతోంది.

ఈ నేపథ్యంలో చిత్ర గ్రాండ్ సక్సెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ వశిష్ట మాట్లాడుతూ.. “క సినిమా టీమ్ అందరికీ కంగ్రాట్స్. నాకు టైమ్ ట్రావెల్ మూవీస్ అంటే ఇష్టం. ఈ కథలోని ఆసక్తిని చివరి వరకు అలాగే హోల్డ్ చేశారు. క్లైమాక్స్ ఆశ్చర్యపరిచింది. ఇద్దరు డైరెక్టర్స్ ఒక మూవీకి సింక్ అయి వర్క్ చేయడం కొత్తగా ఉంది” అని అన్నారు.

ఇంకా ఆయన మాట్లాడుతూ.. “కిరణ్ భయ్యా మరికొంత మంది కొత్త దర్శకులకు అవకాశాలు ఇవ్వాలి. మీ అందరిలాగే క2 కోసం నేనూ వెయిట్ చేస్తున్నా. కిరణ్ ఎప్పుడూ కంటెంట్ నే నమ్ముకుంటాడు. అందులో కొన్ని ఆడతాయి, మరికొన్ని ఫెయిల్ కావొచ్చు. కానీ కొత్తగా మూవీ చేయాలనే కిరణ్ ప్రయత్నిస్తాడు. ఈ సినిమా చూడనివారు థియేటర్స్ కు వెళ్లి చూడండి” అని కోరారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.