సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి డైరెక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి నటిస్తున్న సినిమా మన శంకరవరప్రసాద్ గారు.ఈ రోజే టైటిల్ గ్లింప్స్ ను రిలీజ్ చేయగా సూపర్ రెస్పాన్స్ వస్తుంది. మెగా ఫ్యాన్స్ చిరుని ఎలా చూడాలనుకున్నారో అలానే చూపించాడు అనిల్. ఇక ఈసినిమా లో మరో సీనియర్ స్టార్ హీరో వెంకటేష్ కూడా వుండనున్నారని తెలిసిందే.ఇందులో అయన పవర్ ఫుల్ క్యామియో రోల్ లో కనిపించనున్నారు. త్వరలోనే వెంకటేష్ కూడా జాయిన్ కానున్నారని ఈరోజు అనిల్ రావిపూడి వెల్లడించాడు. చిరు , వెంకీ కలిసి ఓ సినిమాలో నటించడం ఇదే తొలిసారి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమాలో చిరు సరసన నయనతార నటిస్తుండగా భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నాడు.షైన్ స్క్రీన్స్ , గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ల పై సాహు గారపాటి ,సుష్మిత కొణిదెల నిర్మిస్తున్నారు.సంక్రాంతి కానుకగా ఈసినిమా థియేటర్లలోకి రానుంది. ఈఏడాది సంక్రాంతికి వస్తున్నాంతో కెరీర్ లో బిగెస్ట్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ గా కొనసాగుతున్నాడు అనిల్ రావిపూడి.ఇక ఈ డైరెక్టర్ నుండి నెక్స్ట్ వస్తున్న సినిమా కావడంతో మన శంకరవరప్రసాద్ గారుపై అంచనాలు భారీగా వున్నాయి.
ఇక షూటింగ్ విషయానికి వస్తే ఈపాటికే మరో షెడ్యూల్ షూటింగ్ కూడా పూర్తి కావాల్సింది కానీ ఫెడరేషన్ సమ్మె కారణంగా వాయిదా పడింది. వచ్చే నెల 5 నుండి కొత్త షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్ తో సగానికిపైగా షూటింగ్ కంప్లీట్ కానుంది.నవంబర్ లోగా షూటింగ్ అంతా పూర్తి చేయనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























