హైందవ చాలా అద్భుతమైన కథ – బెల్లంకొండ సాయి శ్రీనివాస్

Bellamkonda Sai Sreenivas Calls Haindava a Wonderful Story

కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోరు మీదున్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్, ఈరోజు పవర్‌ఫుల్ టీజర్‌ను లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ ఈవెంట్‌లో హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ… అందరికీ నమస్కారం. ఇది ఒక మిస్టరీ థ్రిల్లర్. ఇది చాలా అద్భుతమైన కథ. డైరెక్టర్ లుదీర్ కథ చెప్పగానే మాకు చాలా నచ్చింది. మహేష్ నా బెస్ట్ ఫ్రెండ్. సెవెన్త్ క్లాస్ నుంచి మేమిద్దరం క్లాస్‌మేట్స్. మహేష్‌కి సినిమా చేయాలని ఉందని నాకు నిజంగా తెలియదు. మహేష్ ఎవరో కాదు, కీర్తిశేషులు డైరెక్టర్ కోడి రామకృష్ణ గారి అల్లుడు. కోడి రామకృష్ణ గారు మనకు ఎన్ని అద్భుతమైన సినిమాలు చేశారో మనకు తెలుసు. శ్యాంప్రసాద్ రెడ్డి గారి లాంటి ప్రొడ్యూసర్లు మళ్లీ ఇండస్ట్రీకి రావాలని నేను, మహేష్ మాట్లాడుకుంటూ ఉంటాం.

ఇప్పుడున్న సమయంలో థియేట్రికల్ ఎక్స్‌పీరియన్స్ ఇచ్చే సినిమాలు చాలా ఇంపార్టెంట్. శ్యాంప్రసాద్ రెడ్డి గారిని ఇన్‌స్పిరేషన్‌గా తీసుకొని చాలా అద్భుతమైన సినిమా తీశాం. ఇది మీకు ఒక అద్భుతమైన ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఇంత అద్భుతమైన కథ ఇచ్చినందుకు లుదీర్ కి థాంక్యూ. సంయుక్త ఒక సినిమాలో వుందంటే అది బ్లాక్ బస్టర్ (నవ్వుతూ) మా టీమ్ అందరికీ ధన్యవాదాలు. అందరం బెస్ట్ ఎఫర్ట్స్ పెట్టి ఈ సినిమా తీశాం. నవంబర్‌ 27న తప్పకుండా మీరందరూ సినిమా చూసి మమ్మల్ని బ్లెస్ చేయాలని కోరుకుంటున్నాను.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.