భరతవర్ష సెకండ్ సింగిల్ రిలీజ్

Bharatavarsha Second Single Released

మాచో స్టార్ టి. గోపీచంద్ ప్రతిష్టాత్మక చారిత్రక యాక్షన్ చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. పవన్ కుమార్ సమర్పిస్తున్నారు. ఇప్పటికే అద్భుతమైన విజువల్స్‌తో రూపొందించిన గ్లింప్స్, క్రీ.శ. 642 నాటి నేపథ్యంలో వచ్చిన టైటిల్ టీజర్, పవర్‌ఫుల్ తొలి పాట ‘వీర జయధీర’ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఈ క్రమంలో నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి రెండో పాటను ఈరోజు విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘అమ్మ కదిలి వచ్చే’ పేరుతో విడుదలైన ఈ పాటకు అనుదీప్ దేవ్ సంగీతం అందించారు. దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ఈ పాట అద్భుతంగా ఆవిష్కరించింది. పాట పేరుకు తగ్గట్టుగానే, ఆ ప్రాంత ప్రజలు భక్తిశ్రద్ధలతో ఆరాధించే శూలాంభ అమ్మవారి ఉత్సవ ఊరేగింపును ఇందులో చూపించారు. భక్తులు అమ్మవారిని పండుగ వాతావరణంలో ఊరేగింపుగా తీసుకురావడం, విగ్రహ ప్రతిష్ఠాపన కోసం నిర్వహించే  పూజా కార్యక్రమాలను దృశ్యరూపంలో అద్భుతంగా తెరకెక్కించారు. ప్రజల భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందం పాటలోని ఆధ్యాత్మిక వైభవాన్ని మరింత పెంచాయి.

దుర్గాదేవి తొమ్మిది దివ్య రూపాలను కూడా ఈ పాటలో వేడుకగా చూపించారు. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కందమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాలను ఆవిష్కరించారు. అగ్నిజ్వాలలతో చుట్టుముట్టిన అగ్నిపర్వతంలా, ఉగ్రరూపంలో దర్శనమిచ్చే అమ్మవారి రూపం పాటలోని అత్యంత ఆకట్టుకునే దృశ్యాల్లో ఒకటిగా నిలిచింది.

కల్యాణ్ చక్రవర్తి త్రిపురనేని తన శక్తివంతమైన దాలతో అమ్మవారి దివ్య వైభవాన్ని, ఉగ్రశక్తిని అద్భుతంగా ఆవిష్కరించారు. సింగర్ స్కంద వేలువలి బృందంలోని ఇతర గాయకులతో కలిసి తన వాయిస్ గానంతో భక్తిభావాన్ని మరింత పెంచారు. ఈ పాట ప్రేక్షకులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని అందిస్తుంది.

ఉత్సవాల నేపథ్యంలో గోపీచంద్, రీతూ వర్మ అద్భుతంగా కనిపించారు. ప్రజల ముఖాల్లో ప్రతిబింబించే ఆనందం, భక్తి ఈ దృశ్యాలకు సహజత్వంతో పాటు భావోద్వేగాలు ఆకట్టుకున్నాయి. సంప్రదాయ ఆచారాలు, వేడుకలను వైభవంగా చూపించిన తీరు ‘అమ్మ కదిలి వచ్చె’ పాటను విజువల్ గా ఆకట్టుకునేలా, ఆధ్యాత్మికంగా ఉన్నతమైన అనుభూతిని అందించేలా రూపొందించారు.

అనుభవజ్ఞులైన టెక్నికల్ టీం ‘భరతవర్ష’ చిత్రాన్ని విజువల్ గా అద్భుతమైన చారిత్రక చిత్రంగా తీర్చిదిద్దుతోంది. సినిమాటోగ్రాఫర్ సౌందర్ రాజన్  ప్రకృతి దృశ్యాలను అద్భుతంగా చిత్రీకరిస్తూ సినిమాకు ప్రత్యేకమైన విజువల్ అప్పీల్‌ను అందిస్తున్నారు. ప్రొడక్షన్ డిజైనర్ చిన్న, ఏడో శతాబ్దపు భారతదేశాన్ని ప్రతిబింబించేలా ఎంతో శ్రద్ధతో సెట్స్‌ను రూపొందించారు. అనుదీప్ దేవ్ అందిస్తున్న సంగీతం సినిమా  వైభవాన్ని మరింత పెంచుతోంది.

ప్రస్తుతం చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంటున్న నేపథ్యంలో ‘భరతవర్ష’పై అంచనాలు పెరుగుతున్నాయి. చరిత్ర నేపథ్యాన్ని భారీ స్థాయిలో ఆవిష్కరిస్తూ, ప్రేక్షకులకు ఒక అద్భుతమైన సినిమాటిక్ అనుభూతిని అందించేందుకు ఈ చిత్రం సిద్ధమవుతోంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.