బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ శ్రీరాముడిగా, టాలెంటెడ్ బ్యూటీ సాయి పల్లవి సీతగా, రాకింగ్ స్టార్ యష్ రావణాసురుడిగా ‘దంగల్’ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మైలాజికల్ ఎపిక్ చిత్రం ‘రామాయణ: రైజ్ ఆఫ్ ఏ లెజెండ్’. ప్రపంచవ్యాప్తంగా దీపావళి కానుకగా నవంబర్ 5న ఈ చిత్రం గ్రాండ్గా విడుదలవుతున్న తరుణంలో మేకర్స్ తాజాగా రిలీజ్ చేసిన కొత్త ట్రైలర్ ఇండస్ట్రీలో సెన్సేషన్ సృష్టిస్తోంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇండియన్ సినిమా చరిత్రలోనే రూ.2000 కోట్ల భారీ బడ్జెట్తో రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ సినిమా తొలి భాగంపై అంచనాలు తారాస్థాయికి చేరాయి. తాజాగా విడుదలైన ట్రైలర్లోని విజువల్స్ మైండ్ బ్లోయింగ్గా ఉండి, కళ్లు చెదిరే గ్రాఫిక్స్తో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి.
ఈ ట్రైలర్లో రాకింగ్ స్టార్ యష్ అత్యంత శక్తివంతమైన లంకాాధీశుడు రావణాసురుడిగా కనిపించిన తీరు సినిమాపై అంచనాలను తారాస్థాయికి చేర్చింది. రావణుడి అరాచకాలు, ఆయన సామ్రాజ్య వైభవం మరియు ముల్లోకాలను గడగడలాడించే పాత్రలో యష్ స్క్రీన్ ప్రెజెన్స్ విజువల్ వండర్లా నిలిచింది.
“యుగయుగాలుగా దేవాసురుల మధ్య సాగిన యుద్ధంలో దేవతలు విజయం సాధించారు… ఒకవేళ ఇదే నా విధిరాత అయితే ఆ ముల్లోకాల సాక్షిగా నేను అతడ్ని వధిస్తాను. ఆ లంక ఎక్కడైనా సరే అన్వేషించి కనిపెడతాను. ఇది రాముని శపథం” అంటూ రణ్ బీర్ కపూర్ చెప్పిన పవర్ఫుల్ డైలాగ్స్ మరియు రావణుడితో ఆయన తలపడే సన్నివేశాలు గూస్బంప్స్ తెప్పిస్తున్నాయి. ప్రపంచ ప్రఖ్యాత సంగీత దర్శకులు ఏ.ఆర్. రెహమాన్ మరియు ఆస్కార్ విన్నర్ హన్స్ జిమ్మర్ సంయుక్తంగా అందిస్తున్న బాక్సాఫీస్ మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఈ చిత్రానికి ప్రధాన హైలైట్గా నిలవనున్నాయి.
ప్రైమ్ ఫోకస్ స్టూడియోస్ మరియు మాన్స్టర్ క్రియేషన్స్ బ్యానర్లపై నమిత్ మల్హోత్రా, యష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని సోనీ పిక్చర్స్ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఏకంగా 50 వేలకు పైగా స్క్రీన్లలో రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తోంది. తొలి భాగం ఈ ఏడాది దీపావళికి రానుండగా, సెకండ్ పార్ట్ వచ్చే ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























