మలయాళ దర్శకుడు షామ్‌దత్, యంగ్ హీరో ఇంద్ర రామ్ కాంబినేషన్లో రూపొందుతున్న సైకలాజికల్ థ్రిల్లర్ ‘డోంట్ స్లీప్’ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. మమ్ముట్టి నటించిన మలయాళం–తమిళ ద్విభాషా థ్రిల్లర్ ‘స్ట్రీట్ లైట్స్’తో దర్శకుడిగా పరిచయమైన సినిమాటోగ్రాఫర్ షామ్‌దత్ .. ఈ చిత్రంతో తెలుగులో దర్శకుడిగా అడుగుపెడుతున్నారు. ‘చౌర్య పాఠం’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఇంద్ర రామ్ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నారు. వీ డ్రీమ్ ఫిలిమ్స్ బ్యానర్‌పై వీ చుడామణి నిర్మిస్తున్న ఈ చిత్రం ఆ సంస్థకు ప్రొడక్షన్ నంబర్ 2.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నాగచైతన్య, విజయ్ సేతుపతి, దుల్కర్ సల్మాన్ కలిసి ఈ సినిమా టీజర్‌ను విడుదల చేశారు. పెళ్లి తర్వాత సంతోషంగా, ప్రశాంతంగా జీవిస్తున్న కథానాయకుడి జీవితంలోకి ఓ కల రూపంలో అనూహ్యమైన పరిణామం చోటు చేసుకుంటుంది. అతను కన్న కలల్లో ఒకటి నిజం కావడం మొదలైనప్పటి నుంచి అతని జీవితం తలకిందులవుతుంది. అతన్ని చంపాలని ప్రయత్నిస్తున్న ఓ మిస్టరీ వ్యక్తి నిరంతరం వెంటాడుతుంటాడు. ప్రాణాలు ప్రమాదంలో పడటంతో అప్రమత్తంగా ఉంటూ, తనను తాను కాపాడుకోవడానికి కథానాయకుడు పోరాడాల్సి వస్తుంది. ‘ “The longer you sleep, the closer he gets.’ అనే ట్యాగ్‌లైన్‌తో సినిమా ఉత్కంఠను పెంచుతోంది.
ఇంతకుముందెన్నడూ చూడని కాన్సెప్ట్‌తో దర్శకుడు షామ్‌దత్ ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో కూర్చోబెట్టే కథనం, ఆకట్టుకునే వాయిస్ ఓవర్, ప్రత్యేకమైన విజువల్ ట్రీట్మెంట్ టీజర్‌ను మరింత ఆసక్తికరంగా మార్చాయి. సినిమాటోగ్రాఫర్‌గా కూడా షామ్‌దత్ తన ప్రతిభను చాటుకున్నారు. అద్భుతమైన విజువల్స్‌తో సినిమా మూడ్‌ను, ఉత్కంఠను మరింత పెంచారు. గోకుల్ హర్షన్ అందించిన నేపథ్య సంగీతం సన్నివేశాల్లోని ఉత్కంఠను పెంచి ప్రేక్షకులను కథలో లీనమయ్యేలా చేస్తోంది.
‘పుష్ప: ది రైజ్’, ‘రంగస్థలం’ చిత్రాలకు పనిచేసిన మోనికా–రామకృష్ణ ఈ సినిమా ప్రొడక్షన్ డిజైన్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. స్టేట్ అవార్డు గ్రహీత మనోజ్ ఎడిటింగ్ చేస్తున్నారు. దుల్కర్ సల్మాన్ నటించిన ‘ఐ యామ్ గేమ్’ చిత్రానికి పనిచేసిన సజీర్ బాబా, లూనా ఈ కథను అందించారు.
ఇంద్ర రామ్ సహజమైన నటనతో ఆకట్టుకున్నారు. విలన్ పాత్రలో రవీంద్ర విజయ్ బలమైన ముద్ర వేశారు. ముఖ్యంగా చివరి సన్నివేశంలో ఆయన నటనలోని వైవిధ్యం కనిపిస్తోంది. తబా రీమా, జోయీత బెనర్జీ, సునీల్ థాపా, ఆడుకలం నరేన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
విభిన్నమైన కథాంశం, విజువల్స్, ఉత్కంఠభరితమైన కథనంతో ‘డోంట్ స్లీప్’ టీజర్ సినిమాపై అంచనాలను పెంచుతోంది. వినూత్నమైన కాన్సెప్ట్‌తో పాటు సాంకేతికంగా ఉన్నత ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఆసక్తికరమైన థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:






























