‘కిష్కింధపురి’ బ్లాక్‌బస్టర్ విజయంతో జోరు మీదున్న యాక్షన్ హల్క్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఆకల్ట్ థ్రిల్లర్ ‘హైందవ’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు లుధీర్ బైరెడ్డి దర్శకత్వంలో, మూన్‌షైన్ పిక్చర్స్ బ్యానర్‌పై మహేష్ చందు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు చిత్రీకరణ ముగింపు దశకు చేరుకోగా, మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఏకకాలంలో జరుగుతున్నాయి. ఇందులో భాగంగా చిత్ర ప్రచార కార్యక్రమాలను ప్రారంభించిన మేకర్స్, ఈరోజు పవర్ఫుల్ టీజర్‌ను లాంచ్ చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ ఈవెంట్లో డైరెక్టర్ లుధీర్ బైరెడ్డి మాట్లాడుతూ.. అందరికీ నమస్కారం. టీజర్‌లాగే సినిమా కూడా అంత ఇంపాక్ట్‌ఫుల్‌గా, పవర్‌ఫుల్‌గా ఉంటుంది. ‘హైందవ’ కథ గురించి చెప్పాలంటే, దశావతారాల గుడి నేపథ్యంలో జరిగే కథ ఇది. నడవలేని విగ్రహాలు కథను నడిపిస్తాయి. విగ్రహాలకు, ఒక పోలీస్ ఆఫీసర్‌కు మధ్య ఎలాంటి కథ జరుగుతుందనేది ఆసక్తికరంగా ఉంటుంది. ఇందులో ఇంకా చాలా అద్భుతమైన కంటెంట్ ఉంది. దశావతారాల మీద సినిమా డైరెక్ట్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఎంతో సపోర్ట్ ఇచ్చిన బెల్లంకొండ సురేష్ గారికి, హీరో సాయి శ్రీనివాస్ గారికి ధన్యవాదాలు. ఇది పెద్ద సినిమా, పెద్ద స్కేల్లో ఉన్న సినిమా అని అంటున్నారు. దానికి కారణం మా ప్రొడ్యూసర్ గారు. ఆయన సంతూర్లో ఒక గుడి కట్టి, ఈ గుడి సినిమా తీశారు. ఈ సినిమాలో ఇంకా అద్భుతమైన కాన్సెప్ట్స్ ఉన్నాయి. అవన్నీ ఇప్పుడే రివిల్ చేయకూడదు. ఆడియన్స్ అందరూ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అందరికీ ఒక మాట చెప్పాలి.. సేవ్ ది టెంపుల్స్, లెట్స్ ప్రొటెక్ట్ అవర్ కల్చర్. హైందవ.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























