నటీనటులు: మాధవ్ భూపతిరాజు, దీపా బాలు, వికాస్ వశిష్ట, వినోద్ కుమార్, శివాజీ రాజా తదితరులు
దర్శకత్వం: మంచాల నాగరాజు
సంగీతం: ప్రశాంత్ ఆర్. విహారి
సినిమాటోగ్రఫీ: రాహుల్ శ్రీవాత్సవ్
నిర్మాణ సంస్థ: మోక్ష ఆర్ట్స్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథ:
తెలంగాణలోని మహిషాపురం అనే గ్రామంలో కరువు మరియు గత్తర వ్యాధి చుట్టుముట్టినప్పుడు, ఊరిని కాపాడుకోవడానికి గ్రామస్తులు అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్టించి దున్నపోతును బలి ఇస్తారు. పదేళ్ల తర్వాత మళ్లీ అమ్మవారి జాతర చేయడానికి నిర్ణయించి, ఊరిలో పుట్టిన ఒక దున్నపోతుకు ‘మారెమ్మ’ అని పేరు పెడతారు. దాన్ని పెంచే బాధ్యతను కర్ణి (మాధవ్ భూపతిరాజు) అనే యువకుడికి అప్పగిస్తారు. అయితే జాతరకు కొద్దిరోజుల ముందు ఆ మారెమ్మ అకస్మాత్తుగా మాయమవుతుంది. ఆ మారెమ్మ ఎక్కడికి వెళ్లింది? దాన్ని వెతికే క్రమంలో కర్ణి ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడు? చివరకు జాతర సాఫీగా సాగిందా లేదా అనేది మిగతా కథ.
విశ్లేషణ :
దర్శకుడు మంచాల నాగరాజు తెలంగాణ గ్రామీణ నేపథ్యం, దైవ విశ్వాసాలు మరియు ఊరి ఆచారాల చుట్టూ ఈ కథను ఆసక్తికరంగా మలిచారు. ప్రధాన పాత్రలో నటించిన మాధవ్ భూపతిరాజు తొలి చిత్రమే అయినా పర్వాలేదనిపించారు. గ్రామీణ వాతావరణం, ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం సినిమా మూడ్‌కి సరిగ్గా కుదిరాయి.
ప్రథమార్థంలో కథలోకి వెళ్లడానికి కాస్త సమయం తీసుకున్నప్పటికీ, గ్రామీణ ఆచారాలను ఆవిష్కరించిన తీరు బాగుంది. కథనంలో అక్కడక్కడా వేగం తగ్గి ఎమోషనల్ కనెక్షన్ ఇంకాస్త బలంగా ఉంటే బాగుండేదనిపిస్తుంది. అయినప్పటికీ, విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విభిన్నమైన కథాంశాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మారెమ్మ’ ఒక డిసెంట్ అనుభూతిని ఇస్తుంది.
తప్పిపోయిన ‘మారెమ్మ’ను వెతికే క్రమంలో ద్వితీయార్థం ప్రారంభమవుతుంది. ఫస్ట్ హాఫ్‌తో పోలిస్తే సెకండాఫ్‌లో డ్రామా, ఎమోషన్స్ కాస్త ఎక్కువుగా ఉంటాయి. జాతర సమయానికి దున్నపోతు దొరుకుతుందా లేదా అనే ఉత్కఠను దర్శకుడు సరిగ్గా నిర్వహించారు. క్లైమాక్స్ సన్నివేశాలు మరియు అమ్మవారి జాతర ఘట్టాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ప్రశాంత్ ఆర్. విహారి అందించిన నేపథ్య సంగీతం మరియు రాహుల్ శ్రీవాత్సవ్ కెమెరా వర్క్ ద్వితీయార్థాన్ని మరింత గ్రాండ్‌గా చూపించడంలో తోడ్పడ్డాయి.
నటీనటుల ప్రతిభ:
ప్రధాన పాత్రలో నటించిన మాధవ్ భూపతిరాజు తొలి చిత్రమే అయినా తెలంగాణ కుర్రాడిగా నటనతో ఓకే అనిపించారు. ఎమోషనల్ సీన్స్‌లో ఇంకా మెరుగవాల్సివుంది. కథానాయిక దీపా బాలు తన పరిధి మేర ఆకట్టుకోగా, వికాస్ వశిష్ట మరియు వినోద్ కుమార్ తమ అనుభవంతో పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ఇతర నటీనటులు కూడా గ్రామీణ వాతావరణానికి సరిపోయేలా ఒదిగిపోయారు.
సాంకేతిక వర్గం :
ఈ సినిమాకి ప్రధాన బలం సాంకేతిక వర్గమనే చెప్పాలి. ముఖ్యంగా ప్రశాంత్ ఆర్. విహారి అందించిన పాటలు, నేపధ్య సంగీతం ప్రతి సీన్‌ని బాగా ఎలివేట్ చేశాయి. గ్రామీణ వాతావరణం, జాతర సన్నివేశాల్లో బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ థియేటర్‌లో మంచి అనుభూతిని ఇస్తుంది. రాహుల్ శ్రీవాత్సవ్ సినిమాటోగ్రఫీ చాలా సహజంగా ఉంది; తెలంగాణ ఊరి పల్లె వాతావరణాన్ని, సంస్కృతిని విజువల్‌గా చాలా అందంగా క్యాప్చర్ చేశారు. ఎడిటింగ్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త వహించి ప్రథమార్థంలో కొన్ని సీన్స్ ట్రిమ్ చేసి ఉంటే కథనానికి మరికాస్త వేగం వచ్చి ఉండేది. నిర్మాణ విలువలు కథాంశానికి తగినట్లుగా చాలా రిచ్‌గా ఉన్నాయి.
మొత్తానికి, సాంకేతిక బృందం కష్టం, నటీనటుల ప్రతిభ మరియు కొత్త కథాంశం ఈ సినిమాను ముందుకు నడిపించాయి. విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చే విభిన్నమైన కథాంశాలు, నేచురల్ డ్రామాలను ఇష్టపడే ప్రేక్షకులకు ‘మారెమ్మ’ ఒక డిసెంట్ వన్-టైమ్ వాచ్ అనిపించుకుంటుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























