బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 హౌస్లో ఊహించని పరిణామాలు చోటుచేసుకున్నాయి. తీవ్రమైన పోటీ మధ్య రసవత్తరంగా సాగిన క్యాప్టెన్సీ టాస్క్లో తన శ్రమతో విజయం సాధించిన అమన్కు చివరకు తీవ్ర నిరాశే మిగిలింది. అమన్ చేతివరకు వచ్చిన క్యాప్టెన్సీ పదవిని యాంకర్ వర్షిణి తన ప్రత్యేక పవర్తో కైవసం చేసుకోవడం హౌస్మేట్స్తో పాటు ప్రేక్షకులను తీవ్రంగా ఆశ్చర్యపరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
మొత్తం మూడు దశల్లో సాగిన ఈ క్యాప్టెన్సీ రేసులో అమన్, ఝాన్సీ, రామ్ ప్రసాద్, అపూర్వ మరియు వర్షిణి పోటీపడ్డారు. చివరి రౌండ్లో ఝాన్సీని ఓడించి అమన్ అత్యంత వేగంగా టాస్క్ పూర్తి చేసి విజేతగా నిలిచాడు. అమన్ నూతన క్యాప్టెన్గా బాధ్యతలు చేపడతాడని భావించిన తరుణంలో బిగ్ బాస్ హౌస్లో మైండ్ గేమ్ మొదలైంది.
గతంలో సాధించిన ‘గ్రాబ్ ఎనీ విన్’ ( అనే మ్యాజికల్ కీ పవర్ను వర్షిణి వెంటనే ఉపయోగించింది. అమన్ సాధించిన విజయాన్ని, క్యాప్టెన్సీ బాధ్యతలను నేరుగా తన సొంతం చేసుకుంటున్నట్లు ప్రకటించి కొత్త క్యాప్టెన్గా నిలిచింది. “ఈ వారం నాకు చాలా ముఖ్యం, సారీ అమన్” అంటూ వర్షిణి క్లారిటీ ఇచ్చింది. కాగా, కష్టపడి ఆడిన అమన్ క్యాప్టెన్సీని వర్షిణి పవర్తో దక్కించుకోవడాన్ని నెటిజన్లు సోషల్ మీడియాలో తీవ్రంగా ట్రోల్ చేస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























