ఆకాశంలో ఒక తారలో శృతి హాసన్ కూడా

Shruti Haasan Joins the Cast of Aakasam Lo Oka Tara

సీతారామంతో తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు మలయాళం హీరో దుల్కర్ సల్మాన్. ఈసినిమా తరువాత గత ఏడాది లక్కీ భాస్కర్ తో వచ్చి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ కొట్టాడు ఈ హీరో.అంతేకాదు ఈసినిమాతో దుల్కర్ మొదటి సారి 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు.అలా తెలుగు లో చేసిన రెండు సినిమాలు ఒకదాన్ని మించి ఒకటి హిట్ కావడంతో ప్రస్తుతం దుల్కర్ తెలుగులో మరో రెండు సినిమాలు చేస్తున్నాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

అందులో ఆకాశంలో ఒక తార అనే సినిమా ఒకటి.సగం షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది.రీసెంట్ గా ఈసినిమా నుండి  గ్లింప్స్ రిలీజ్ చేయగా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. కేవలం గ్లింప్స్  తోనే సినిమా చూడాలనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు మేకర్స్. పవన్ సాధినేని ఈసినిమాను తెరకెక్కిస్తుండగా గుణ్ణంసందీప్ ,గుణ్ణం రమ్య నిర్మిస్తున్నారు.ఇక ఈసినిమాలో కీలక పాత్ర కోసం శృతి హాసన్ ను తీసుకున్నారు.రీసెంట్ ఆమె షూటింగ్ లో కూడా జాయిన్ అయ్యింది.ఇందులో దుల్కర్ సరసన సాత్విక వీరవల్లి నటిస్తుండగా జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. కుదిరితే ఈఏడాది చివర్లో విడుదలచేయనున్నారు.

ఇక ఈసినిమా కన్నా ముందు దుల్కర్, కాంతతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు.పాన్ ఇండియా మూవీ గా తెరకెక్కుతుంది.సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తుండగా భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తుంది.రానా దగ్గబాటి ఈసినిమాకు ఓ నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు.సెప్టెంబర్ 12న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.