‘కింగ్ ఆఫ్ ఎంటర్‌టైన్‌మెంట్’ శ్రీ విష్ణు నవ్వుల బ్లాక్‌బస్టర్ ‘కామ్రేడ్ కళ్యాణ్’. జానకి రామ్ మారెళ్ల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కోన వెంకట్ సమర్పించగా, స్కంద వాహన మోషన్ పిక్చర్స్ ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై వెంకట కృష్ణ కర్నాటి, సీతా కర్నాటి నిర్మించారు. మహిమా నంబియార్ కథానాయికగా నటించారు. అక్టోబర్ 9న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందనను అందుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోంది. ఈ సందర్భంగా చిత్ర బృందం సక్సెస్ సెలబ్రేషన్స్ నిర్వహించింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రెజెంటర్ కోన వెంకట్ మాట్లాడుతూ..ఈ రోజు మార్నింగ్ షో నుంచే మా ‘కామ్రేడ్ కళ్యాణ్’ జనజీవన స్రవంతిలో కలిసిపోయి ‘కామెడీ కళ్యాణ్’గా మారిపోయాడు. సినిమా చూసిన ప్రేక్షకులు ఇది పూర్తిస్థాయి కామెడీ సినిమానా అని ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే శ్రీ విష్ణు చేతిలో గన్స్, గ్రీన్ డ్రెస్ చూసి యాక్షన్ సినిమా అనుకున్నారు. హిలేరియస్ ఎంటర్టైన్మెంట్ ని ప్రేక్షకులు చాలా ఆస్వాదిస్తున్నారు. రవితేజతో ‘అమ్మ నాన్న ఓ తమిళ అమ్మాయి’, మహేష్ బాబుతో ‘దూకుడు’, ఎన్టీఆర్‌తో ‘అదుర్స్’.. ఇలా నేను ఏ హీరోతో మొదటిసారి పనిచేసినా ఆ సినిమా సూపర్ సక్సెస్ కావడం ఒక పరిపాటిగా మారింది. అదే సెంటిమెంట్ మరోసారి శ్రీ విష్ణు సినిమాతో రిపీట్ అయింది.ఇది నిజంగా పండుగ సినిమా.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























