సేవ్ ది టైగర్స్ డైరెక్టర్ తో సినిమా చేయనున్న సాయి దుర్గా తేజ్

Sai Durga Tej’s Next Movie Officially Announced

మెగా హీరో సాయిదుర్గా తేజ్ (సాయిధరమ్ తేజ్) తన పుట్టినరోజు సందర్భంగా అభిమానులకు అదిరిపోయే తీపి కబురు అందించారు. ఆయన కెరీర్‌లో 19వ చిత్రంగా (#SDT19) తెరకెక్కనున్న ఈ కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రానికి ‘సేవ్ ది టైగర్స్’ వంటి సూపర్ హిట్ వెబ్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించిన దర్శకుడు తేజ కనుమ దర్శకత్వం వహించనున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై ఈ భారీ చిత్రాన్ని నిర్మించనున్నారు. కుటుంబ సంబంధాలు, హస్యంతో కూడిన వినోదాత్మక చిత్రాలను తెరకెక్కించడంలో తేజ కనుమకు మంచి గుర్తింపు ఉండటంతో, ఈ కాంబినేషన్‌పై ఇటు ఇండస్ట్రీలోనూ, అటు అభిమానుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.

ప్రస్తుతం సాయిదుర్గా తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా షూటింగ్‌తో బిజీగా ఉండగా, ఆ చిత్రం పూర్తయిన వెంటనే ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కనుంది. ఈ కొత్త సినిమాకు సంబంధించిన ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్రబృందం త్వరలోనే వెల్లడించనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.