యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్‌ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్‌లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్స్ కార్తీక్ సుబ్బరాజ్, వెంకట్ ప్రభు సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ సందర్బంగా హీరోయిన్ సాయి పల్లవి మాట్లాడుతూ ‘‘మా తండేల్ చిత్ర యూనిట్‌ను ఆశీర్వదించటానికి ఇక్కడకు వచ్చిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు. ఈ కథను ఓ రియల్ స్టోరీలాగా ముందుగా చెప్పారు. తర్వాత దాన్ని అందమైన ప్రేమ కథగా మార్చారు. ఈ జర్నీకి మూడేళ్ల సమయం పట్టింది. పిక్చరైజేషన్‌కి ఏడాదిన్నర సమయం పట్టింది. చైతన్య అద్భుతంగా తన పాత్రలో ఒదిగిపోయి ప్రాణం పెట్టి నటించారు.” అని తెలిపారు.
ఇంకా ఆమె మాట్లాడుతూ.. “దేవిశ్రీగారు అందమైన పాటలను ఇచ్చారు. సినిమా రిలీజ్‌కు ముందే ఆడియెన్స్ పాటలను పెద్ద హిట్ చేసి మా అందరికీ ఎనర్జీని ఇచ్చారు. అరవింద్‌గారు నాకు తండ్రితో సమానం. ఏడాదిన్నర పాటు సినిమాను షూట్ చేసినప్పుడు ఎక్కడా ఇబ్బంది లేకుండా మా టీమ్‌కు సపోర్ట్‌ను అందించారు. కరుణాకరన్ గారికి తెలుగు ఇండస్ట్రీలోకి స్వాగతం చెబుతున్నాను. అద్భుతంగా నటించారు. ఈ జర్నీలో నేను చాలా విషయాలు నేర్చుకున్నాను. సినిమా తప్పకుండా అందరికీ నచ్చుతుంది’’ అని అన్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: