‘మేమ్ ఫేమస్’ చిత్రంతో యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకున్న యంగ్ హీరో సుమంత ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ రూరల్ లవ్ డ్రామా ‘గోదారి గట్టుపైన’ . మే 8న థియేటర్లలోకి వచ్చిన ఈ చిత్రం డీసెంట్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద 10కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి హిట్ అనిపించుకుంది. ఇక థియేట్రికల్ రన్ ముగియడంతో ఈ సినిమా ఓటీటీ బాట పట్టింది.ప్రముఖ ఓటీటీ జెయింట్ అమెజాన్ ప్రైమ్ వీడియో ( వేదికగా ఈ చిత్రం డిజిటల్ స్ట్రీమింగ్కు వచ్చేసింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కథేంటంటే? :
పదవ తరగతితోనే చదువు ఆపేసి, ఆటో నడుపుకుంటూ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ లోకంగా బతికే అమాయకపు కుర్రాడు రాజు (సుమంత ప్రభాస్). తన చెల్లెలితో పాటు ఇంజినీరింగ్ చదువుతున్న మాయ (నిధి ప్రదీప్)ను చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు. అయితే, మాయ తండ్రి శ్యాంబాబు (జగపతి బాబు) చాలా స్ట్రిక్ట్. ఊరంతా భయపడే శ్యాంబాబు.. తన కూతురిని కేవలం ఉన్నత స్థితిలో ఉన్న వాడికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటాడు. మరి ఆటో డ్రైవర్ అయిన రాజు ప్రేమని శ్యాంబాబు ఒప్పుకున్నాడా? అసలు రాజు ఎందుకు జైలుకు వెళ్లాల్సి వచ్చింది? చివరికి వీరి ప్రేమ కథ ఎలా ముగిసింది? అనేదే ఈ సినిమా కథ.
యూట్యూబ్‌లో దాదాపు 100కు పైగా సక్సెస్ఫుల్ షార్ట్ ఫిలిమ్స్ తీసిన టాలెంటెడ్ క్రియేటర్ సుభాష్ చంద్ర ఈ చిత్రంతో వెండితెరకు దర్శకుడిగా పరిచయమయ్యారు. గోదావరి జిల్లాల అందాలను, పల్లెటూరి వాతావరణాన్ని చాలా చక్కగా చూపించారు.
అభినవ్ రావు నిర్మించిన ఈ సినిమాలో జగపతి బాబు, రాజీవ్ కనకాల, సీనియర్ నటి లైలా, రీణు, దేవి ప్రసాద్, హర్షవర్దన్, సుదర్శన్, రాజ్ కుమార్ కసిరెడ్డి కీలక పాత్రలు పోషించారు. నాగవంశీ కృష్ణ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు.
గోదావరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ప్యూర్ విలేజ్ లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా సినిమాలను ఇష్టపడే వారికి వీకెండ్లో అమెజాన్ ప్రైమ్‌లో చూసేందుకు ‘గోదారి గట్టుపైన’ ఒక మంచి ఆప్షన్ కానుంది.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























