నటీనటులు: సూర్య, త్రిష, ఆర్జే బాలాజీ, అనఘా మాయా రవి, ఇంద్రాన్స్, నట్టి సుబ్రమణియన్
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
దర్శకత్వం: ఆర్జే బాలాజీ
సంగీతం: సాయి అభ్యంకర్
సినిమాటోగ్రఫీ: జీకే విష్ణు
నిర్మాణం: డ్రీమ్ వారియర్ పిక్చర్స్
చట్టం తన పని తాను చేసుకుపోతుంది అంటారు.. కానీ ఆ చట్టం సామాన్యుడికి అన్యాయం చేస్తున్నప్పుడు, స్వయంగా ఆ దేవుడే దిగివస్తే ఎలా ఉంటుంది? అనే వినూత్నమైన పాయింట్‌తో తెరకెక్కిన చిత్రం ‘వీరభద్రుడు’.తమిళ స్టార్ హీరో సూర్య ఇందులో దైవశక్తి కలిగిన క్షేత్రపాలకుడిగా, లాయర్‌గా ద్విపాత్రాభినయం కనిపించడం ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచింది.మరి ఈరోజే థియేటర్లలోకి వచ్చిన ఈ సినిమా ఎలా వుంది? సూర్యకు హిట్ ఇచ్చిందో లేదో తెలుసుకుందాం.
కథ:
నాంపల్లి కోర్టులో బేబీ కృష్ణ (ఆర్జే బాలాజీ) అనే లాయర్ వ్యవస్థను తన గుప్పెట్లో పెట్టుకుంటాడు. తన కూతురు ఆపరేషన్ కోసం దాచుకున్న బంగారాన్ని పోగొట్టుకున్న ఒక వృద్ధుడు (ఇంద్రాన్స్), ఆ బంగారం కోర్టు ద్వారా తిరిగి పొందడానికి బేబీ కృష్ణ దగ్గరకు వెళ్తాడు. కానీ బేబీ కృష్ణ అతన్ని మోసం చేస్తాడు. దిక్కుతోచని స్థితిలో ఆ వృద్ధుడు క్షేత్రపాలకుడైన ‘వీరభద్రుడిని’ వేడుకుంటాడు. అప్పుడు లాయర్ సూర్య రూపంలో వీరభద్రుడు రంగంలోకి దిగుతాడు. దేవుడికి, వ్యవస్థను శాసించే మనిషికి మధ్య జరిగే పోరాటమే ఈ సినిమా.
విశ్లేషణ :
సినిమా ప్రారంభం లాయర్ బేబీ కృష్ణ క్యారెక్టరైజేషన్, కోర్టులో అతని అరాచకాలతో సాగుతుంది. మొదటి 40 నిమిషాల వరకు సూర్య ఎంట్రీ ఉండదు. కథలోకి సూర్య ప్రవేశించిన తర్వాత సినిమా వేగం పుంజుకుంటుంది. సూర్య ఎంట్రీ సీన్, ఆయన స్టైలిష్ లుక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇంటర్వెల్ సమయానికి దేవుడికి – మనిషికి మధ్య సవాల్‌తో కథ ఆసక్తికరంగా మారుతుంది.
సెకండాఫ్‌లో కోర్టు రూమ్ డ్రామా ప్రధానంగా సాగుతుంది. చట్టంలోని లొసుగులను వాడుకుని బేబీ కృష్ణ వేసే ఎత్తులు, వాటిని సూర్య తన తెలివితేటలతో ఎలా చిత్తు చేశారనేది ఆసక్తికరం. మధ్యలో కొంచెం సాగదీత అనిపించినా, క్లైమాక్స్‌కు ముందు వచ్చే సన్నివేశాలు సినిమాను మళ్ళీ ట్రాక్‌లోకి తెస్తాయి.
నటీనటుల పనితీరు :
సూర్య ఈ సినిమాకు ప్రధాన బలం. సాధారణ లాయర్‌గా క్లాస్ లుక్‌లోనూ, వీరభద్రుడిగా మాస్ రుద్రతాండవంలోనూ సూర్య విశ్వరూపం చూపించారు. ఆయన స్క్రీన్ ప్రెజెన్స్ సినిమా స్థాయిని పెంచింది.
విలన్ పాత్రలో ఆర్జే బాలాజీ మేనరిజమ్స్ కొత్తగా ఉన్నాయి. అయితే కొన్ని చోట్ల హీరో కంటే విలన్ ఎలివేషన్స్ ఎక్కువయ్యాయనే భావన కలుగుతుంది. త్రిష పాత్ర పరిధి తక్కువే అయినా, కథలో కీలకమైన మలుపుకు కారణమవుతుంది. ఆమె నటన హుందాగా ఉంది.ఇక ఇంద్రాన్స్ తన ఎమోషనల్ యాక్టింగ్‌తో కన్నీళ్లు పెట్టిస్తారు. అనఘా రవి కూడా తన పాత్రకు న్యాయం చేశారు.
సాంకేతిక విభాగం :
సాయి అభ్యంకర్ మ్యూజిక్ ఈ సినిమాకు ప్రాణం. సూర్య ఎలివేషన్ సీన్స్‌లో వచ్చే సౌండ్ ట్రాక్ థియేటర్లలో మోత మోగిస్తుంది. జీకే విష్ణు విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ మరియు టెంపుల్ సెట్టింగ్స్‌ను చాలా బాగా చూపించారు. నిర్మాణ విలువలు ఉన్నతంగా వున్నాయి.
చివరగా ‘వీరభద్రుడు’ ఒక పక్కా కమర్షియల్ ఎంటర్‌టైనర్. సూర్య అభిమానులకు ఇది ఐ-ఫీస్ట్. ఒక మంచి మెసేజ్ మరియు అద్భుతమైన క్లైమాక్స్ కోసం ఈ వీరభద్రుడి తాండవాన్ని థియేటర్లలో చూడవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























