సింగ్ గీతం నుండి ఏమైంది సాంగ్ రిలీజ్ 

Emaindhi Emaindhi LYRICAL VIDEO out now

లెజెండరీ డైరెక్టర్ సింగీతం శ్రీనివాసరావు తన సుదీర్ఘ సినీ ప్రయాణంలో ఎప్పుడూ కొత్తదనానికి ప్రాధాన్యం ఇస్తూ ప్రేక్షకులని అలరించారు ఇప్పుడు ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘సింగ్ గీతం’ మరోసారి అలాంటి వినూత్నమైన కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. వైజయంతి మూవీస్ బ్యానర్‌పై నాగ్ అశ్విన్ నిర్మిస్తున్న ఈ చిత్రం ఇప్పటికే టీజర్లతో ఆసక్తిని రేకెత్తించగా, తాజాగా విడుదలైన ‘ఏమైంది’ పాట ఆ చిత్రంలోని విభిన్న ప్రపంచానికి సరదా పరిచయాన్ని అందించింది. ఈ పాటను స్టార్ హీరోయిన్ శృతి హాసన్ లాంచ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘ఏమైంది’ పాట ఓ మ్యూజికల్ పజిల్‌లా సాగుతుంది. ఒక వింత పరిస్థితిలో చిక్కుకున్న గ్రామాన్ని ఈ పాట పరిచయం చేస్తుంది. ఆ గ్రామంలో సాధారణ సంభాషణలన్నీ పాటలుగా మారిపోతాయి. ఎందుకు ఇలా జరిగిందో ఎవరికీ అర్థం కాకపోయినా, గ్రామస్తులంతా ఆ పరిస్థితికి అలవాటు పడాల్సి వస్తుంది. ప్రశ్నలు, సందేహాలు, ఆశ్చర్యాలన్నీ ట్యూన్స్ గా మారిపోతూ వినోదాన్ని పంచుతాయి.

ఈ పాట ప్రత్యేకత ఏమిటంటే, కథను ముందుకు నడిపిస్తూనే వినోదాన్ని అందించడం. గ్రామస్తుల గందరగోళం, ఆసక్తి, ఆ వింత పరిస్థితికి సమాధానం వెతికే ప్రయత్నం ప్రతి లిరిక్‌లో కనిపిస్తుంది.

రాక్‌స్టార్ దేవిశ్రీ ప్రసాద్ అందించిన ట్యూన్ ఈ పాటకు మరింత ఆకర్షణగా నిలిచాయి. ఉత్సాహభరితమైన ట్యూన్‌తో పాటు కథలోని మిస్టరీని కూడా చక్కగా ఎస్టాబ్లిష్ చేశారు. మరో విశేషం ఏమిటంటే, ఈ పాటను చిత్రంలోని నటీనటులే ఆలపించడం. దీంతో పాట మరింత సహజంగా, కథలో భాగంగా అనిపిస్తుంది.

శ్రీమణి, దేవిశ్రీ ప్రసాద్, గౌతమ్ చల్లగుల్ల, రత్న శ్రీకర్, శశాంక్ చింతలపూడి కలిసి రాసిన సాహిత్యం చిత్రంలోని విచిత్ర పరిస్థితిని, గ్రామస్తుల భావోద్వేగాలను సరదాగా ప్రజెంట్ చేసింది.

నూతన నటులు అయాన్, అహల్య, శాలిని ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ‘సింగ్ గీతం’ వినూత్నమైన వినోదాత్మకమైన సినీ అనుభూతిని అందించబోతోంది. ఈ చిత్రం జూన్ 11న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.