హైదరాబాద్‌లోని ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో తొలి ఐమాక్స్ స్క్రీన్‌

AMB Classic Victory Brings Back the IMAX Experience to Hyderabad

దక్షిణ భారతదేశంలో అత్యంత ప్రీమియం మల్టీప్లెక్స్ బ్రాండ్లలో ఒకటైన ఏఎంబీ సినిమాస్, హైదరాబాద్‌లో నిర్మితమవుతున్న తన కొత్త ప్రాపర్టీ ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఐమ్యాక్స్ (IMAX) స్క్రీన్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రపంచ స్థాయి సినిమా అనుభూతిని ప్రేక్షకులకు అందించడంలో ఎప్పుడూ ముందుండే ఏఎంబీ సినిమాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ఏషియన్ గ్రూప్ అధినేతలు సునీల్ నారంగ్, భరత్ నారంగ్‌ల భాగస్వామ్యంతో ఏర్పడిన సంస్థ, దక్షిణ భారతదేశంలో తొలి డాల్బీ సినిమాను ప్రారంభించడం నుంచి, హైదరాబాద్‌లో తొలి HDR by Barco స్క్రీన్‌లలో ఒకదాన్ని అందించడం వరకు థియేట్రికల్ ఎగ్జిబిషన్ రంగంలో కొత్త ప్రమాణాలను నెలకొల్పింది.

ఇప్పుడు ఆ లెగసీని కొనసాగిస్తూ, ఏషియన్ గ్రూప్ మహేష్ బాబు, విక్టరీ వెంకటేష్, రానా దగ్గుబాటిలతో కలిసి తెలుగు రాష్ట్రాల్లోనే ఏకైక ఐమ్యాక్స్ స్క్రీన్‌ను ఏఎంబీ క్లాసిక్ విక్టరీలో ఏర్పాటు చేయనుంది.

ఈ కొత్త మల్టీప్లెక్స్, తెలుగు సినీ చరిత్రలో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న సుదర్శన్ 70 ఎంఎం వద్ద నిర్మితమవుతోంది. దశాబ్దాలుగా సినీ వేడుకలకు, ఎన్నో చారిత్రాత్మక బ్లాక్‌బస్టర్ విజయాలకు వేదికగా నిలిచిన ఈ ప్రదేశం, ఇప్పుడు ఏఎంబీ క్లాసిక్ విక్టరీ రూపంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించబోతోంది.

సినిమా వారసత్వాన్ని, అత్యాధునిక సాంకేతికతను ఒకే వేదికపై కలిపే ఈ మల్టీప్లెక్స్, హైదరాబాద్ ప్రేక్షకులకు అత్యున్నత స్థాయి థియేట్రికల్ అనుభూతిని అందించనుంది.

ఏఎంబీ క్లాసిక్ విక్టరీ త్వరలోనే ప్రారంభం కానుండగా, ప్రీమియం మూవీ-గోయింగ్ అనుభూతికి ఇది హైదరాబాద్‌లో కొత్త గమ్యస్థానంగా మారనుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.