మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కిన భారీ పాన్ ఇండియా చిత్రం ‘పెద్ది’ థియేటర్లలోకి వచ్చి ప్రేక్షకులను అలరిస్తోంది. జూన్ 3 రాత్రి తెలుగు రాష్ట్రాల్లో నిర్వహించిన స్పెషల్ ప్రీమియర్ షోలతోనే సినిమా సందడి మొదలైంది. అయితే సినిమా ప్రీమియర్ షోలను వీక్షించిన ప్రేక్షకులు చిత్రంలోని సూపర్ హిట్ సాంగ్ ‘చికిరి చికిరి’ కి సంబంధించి ఒక ముఖ్యమైన మార్పును వెంటనే గమనించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
పాట ఆడియో వెర్షన్‌లో ఉన్న కొన్ని వివాదాస్పద లిరిక్స్‌ను థియేట్రికల్ (సినిమా) వెర్షన్‌లో మేకర్స్ సైలెంట్‌గా మార్చేశారు. సంగీత దిగ్గజం ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఈ పాట విడుదలైన క్షణం నుంచే సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అయింది. అయితే, మొదట విడుదలైన ఆడియోలో “పడతా పడతా పడతా.. ఎనుకే ఎనుకే పడతా.. సరుకు సామాన్లు సూసి మీసం లేసి ఏసే కేక.. చికిరి చికిరి” అనే లైన్స్ ఉన్నాయి.
ఈ లైన్లలో వచ్చే “సరుకు సామాన్లు” అనే పదంపై సోషల్ మీడియాలో కొందరు తీవ్ర విమర్శలు చేశారు. ఈ పదాలు మహిళలను కించపరిచే విధంగా ఉన్నాయంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పాట విడుదలైన సమయంలో విమర్శలపై చిత్ర బృందం ఎలాంటి వివరణ ఇవ్వనప్పటికీ.. సినిమా రిలీజ్ సమయానికి మాత్రం వివాదాలకు తావు లేకుండా జాగ్రత్త పడింది. థియేటర్లలో ప్రదర్శితమవుతున్న వెర్షన్‌లో ఆ అభ్యంతరకర పదాలను తొలగించి, వాటి స్థానంలో కొత్త లిరిక్స్‌ను చేర్చారు.
లిరిక్స్ మార్చినప్పటికీ రామ్ చరణ్ ఊరమాస్ ఎనర్జీ, డ్యాన్స్ మూమెంట్స్ థియేటర్లలో ప్రేక్షకులను, అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటూ థియేటర్లను షేక్ చేస్తున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























