టాలీవుడ్ ‘మాస్ కా దాస్’ విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైలా’. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న విడుదలకానుంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్గా నటిస్తోంది. రీసెంట్గా రెండు పాటలు అలాగే టీజర్ రిలీజ్ అవ్వగా వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
కాగా త్వరలోనే ఈ మూవీ థియేట్రికల్ ట్రైలర్ కూడా విడుదలకానుంది. ఈ నేపథ్యంలో నేడు ఈ మూవీ నుంచి థర్డ్ సింగిల్ విడుదలయింది. ‘ఓహో రత్తమ్మ’ అంటూ సాగే ఈ సాంగ్‌ను ప్రముఖ జానపద కళాకారుడు పెంచల్ దాస్ స్వయంగా రచించి ఆలపించారు. మరో పాపులర్ సింగర్ మధుప్రియ ఆయనతో కలిసి ఆలపించారు. లియోన్ జేమ్స్ అందించిన సంగీతం మంచి రిథమ్‌తో యువతను దృష్టిలో పెట్టుకుని చిత్రీకరించినట్టుగా అర్ధమవుతోంది.
ఇక ఈ సినిమాలో విశ్వక్ లేడీ గెటప్‌లో కనిపించనుండటం విశేషం. ఇప్పటికే దీనికి సంబంధించిన ఫస్ట్ లుక్ కి టెరిఫిక్ రెస్పాన్స్ వచ్చింది. దాంతో సినిమాపై అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ థర్డ్ సింగిల్ వాటిని మరింత హై కి తీసుకెళ్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇక విశ్వక్ లాస్ట్ రెండు సినిమాలు అనుకున్నంతగా రిజల్ట్ ఇవ్వలేకపోయాయి. దాంతో షైన్ స్క్రీన్స్ బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ మూవీతో ఎలాగైనా గట్టిగ కొట్టాలని భావిస్తున్నాడు.
ఇదిలావుంటే విశ్వక్ దీని తరువాత ‘ఫంకీ’ అనే చిత్రంలో నటించనునున్నాడు. ‘జాతి రత్నాలు’ ఫేమ్ కెవి అనుదీప్ ఈ సినిమాను డైరెక్ట్ చేయనుండగా.. భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నాడు. త్వరలోనే ఈ మూవీ షూటింగ్ స్టార్ట్ కానుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ శ్రీకర స్టూడియోస్, ఫార్ట్యూన్ఫ్ ఫోర్ సినిమాస్ ఈ సినిమాను నిర్మించనున్నాయి.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























