తండ్రిగా, నటుడిగా ఎంతో గర్వంగా ఉంది.. పెద్ది టీమ్‌ను అభినందిస్తూ చిరంజీవి పోస్ట్

Chiranjeevi Congratulates the Peddi Team with a Special Post

రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘పెద్ది’ ఈరోజే థియేటర్లలోకి రాగ బ్లాక్ బస్టర్ టాక్ తో బాక్సాఫీస్ కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది.ఇప్పటికే బుక్ మై షోలో 10లక్షలకుపైగా టికెట్స్ తెగాయి. థియేటర్లు అన్ని హౌస్ ఫుల్ అవుతున్నాయి. ఇక ఈ ఘన విజయంపై మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ భావోద్వేగభరితమైన పోస్ట్ పెట్టారు. తాను ప్రస్తుతం షూటింగ్ నిమిత్తం పొల్లాచిలో ఉన్నప్పటికీ, తన ధ్యాసంతా ‘పెద్ది’ సినిమా పైనే ఉందని చిరు పేర్కొన్నారు.ఈ సందర్భంగా చిత్రబృందానికి, దర్శకుడు బుచ్చిబాబుకు, ముఖ్యంగా తన కుమారుడు రామ్ చరణ్‌కు ఆయన ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చరణ్ గత రెండేళ్లుగా ‘పెద్ది’ కోసం ఎంత కష్టపడ్డాడో తాను దగ్గర నుంచి చూశానని చిరంజీవి వెల్లడించారు. పెద్ది పాత్రలో పూర్తిగా లీనమవ్వడానికి చరణ్ అహర్నిశలు శ్రమించాడని, అతని కష్టం, నిజాయితీ, పాత్ర పట్ల చూపించిన నిబద్ధతకు ఈ విజయం సరైన గుర్తింపు అని కొనియాడారు. పాత్ర కోసం చరణ్ చూపించిన అంకితభావం, క్రమశిక్షణ, పట్టుదల ప్రతి ఫ్రేమ్‌లో కనిపిస్తున్నాయని ప్రశంసించారు.ప్రేక్షకుల నుంచి వస్తున్న ప్రేమ, ప్రశంసలు చూస్తుంటే ఒక తండ్రిగా మాత్రమే కాకుండా, ఒక నటుడిగా కూడా ఎంతో గర్వంగా అనిపిస్తోందని, ప్రేక్షకులు అతని నటనను ఆదరిస్తుండటం చాలా సంతోషంగా ఉందంటూ చిరు భావోద్వేగంగా స్పందించారు.

ఇక దర్శకుడు బుచ్చిబాబు సానా ప్రతిభను చిరంజీవి ప్రత్యేకంగా ప్రశంసించారు. ఇంత బలమైన కథను రాసి, అదే స్థాయిలో తెరపై ఆవిష్కరించినందుకు ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. అలాగే, తొలి చిత్రంతోనే ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో ఈ ప్రాజెక్ట్‌ను నిర్మించిన నిర్మాత వెంకట సతీష్ కిలారుకు కూడా తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.

సినిమాలో కీలక పాత్రలు పోషించిన కన్నడ స్టార్ శివ రాజ్‌కుమార్, జగపతి బాబు నటనను చిరంజీవి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ముఖ్యంగా అప్పలసూరి పాత్రలో జగపతి బాబు జీవించారని, శివరాజ్ కుమార్ తన పాత్రకు పూర్తి న్యాయం చేశారని కొనియాడారు.

ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అందించిన అద్భుతమైన సంగీతం, హృదయాన్ని కదిలించే నేపథ్య సంగీతం సినిమాకు గొప్ప బలంగా నిలిచాయన్నారు.

విజువల్స్ & ఎడిటింగ్: సినిమాటోగ్రాఫర్ రత్నవేలు ప్రతి ఫ్రేమ్‌ను అత్యద్భుతంగా చిత్రీకరించారని, ఆర్ట్ డైరెక్టర్ అవినాష్ కొల్లా అమోఘమైన ఆర్ట్ వర్క్‌ను, ఎడిటర్ నవీన్ నూలి నైపుణ్యాన్ని కూడా చిరు ప్రత్యేకంగా ప్రశంసించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.