యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, స్టార్ హీరోయిన్ సాయి పల్లవి జంటగా నటించిన చిత్రం ‘తండేల్’. ‘కార్తికేయ-2’ లాంటి బంపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ చందూ మొండేటి దర్శకత్వంలో సక్సెస్ఫుల్ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు నిర్మించిన ఈ చిత్రం ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా భారీగా విడుదల కానుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రమోషన్స్ ఓ రేంజ్లో చేస్తుంది. తాజాగా గురువారం ఈ మూవీ తమిళ ట్రైలర్‌ను చెన్నైలో విడుదల చేశారు. కోలీవుడ్ స్టార్ కార్తి ముఖ్య అతిథిగా హాజరై ట్రైలర్‌ను విడుదల చేశారు. ఇంకా ఈ కార్యక్రమంంలో డైరెక్టర్స్ కార్తీక్ సుబ్బరాజ్, వెంకట్ ప్రభు సహా చిత్ర యూనిట్ పాల్గొన్నారు. ఇక ఈ చిత్రాన్ని తమిళంలో డ్రీమ్ వారియర్ పిక్చర్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
ఈ సందర్బంగా యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య చిత్ర విశేషాలు పంచుకున్నారు. చైతూ ఏమన్నారో ఆయన మాటల్లోనే తెలుసుకుందాం.. ‘‘నాకు చెన్నై అంటే ఎప్పుడూ ప్రత్యేకమైన అభిమానమే. కార్తిగారికి స్పెషల్ థాంక్స్. ఆయన తొలి సినిమా నుంచి రీసెంట్గా రిలీజైన సత్యం సుందరం వరకు మనల్ని అలరిస్తూనే ఉన్నారు. ఇంకా ఎన్నో గొప్ప సినిమాలతో మెప్పించాలని కోరుకుంటున్నాను. నాన్నగారు ఎప్పుడూ కార్తి గురించి ప్రస్తావిస్తూనే ఉంటారు. ఆయన మా ఇంట్లో సభ్యుడిగా ఎప్పుడో మారిపోయారు.”
“అలాగే వెంకట్ ప్రభుగారికి, కార్తీక్ సుబ్బరాజ్‌గారికి థాంక్స్. తండేల్ జర్నీ గురించి చెప్పాలంటే ముందు డైరెక్టర్ చందు ఓ డాక్యుమెంటరీలా కథను చెప్పారు. ఎంతో ఎగ్జయిటింగ్‌గా అనిపించింది. శ్రీకాకుళం నుంచి వెళ్లిన కొంత మంది జాలర్లు గుజరాత్‌కు వెళ్లి. అక్కడి నుంచి అనుకోకుండా పాకిస్థాన్‌లో ఎంట్రీ ఇచ్చి అక్కడ అరెస్ట్ అయ్యి తప్పించుకుని వచ్చారు. ఇదొక పెద్ద జర్నీ. ఆ కథ వినగానే చాలా ఎగ్జయిట్ అయ్యాను. నేను శ్రీకాకుళం వెళ్లి అక్కడి వారిని గమనించాను. చిన్న చిన్న విషయాలను తెలుసుకుని మరీ నటించాను.”
“చందు మొండేటిగారు ఇలాంటి సినిమాను నాపై నమ్మకంతో చేసినందుకు నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇలాంటి సినిమాలు చేసే అవకాశాలు అరుదుగా వస్తుంటాయి. దాంతో మన బెస్ట్ ఎఫర్ట్ ఇచ్చే చాన్స్ వస్తుంది. ఇలాంటి కథ మన ఆడియెన్స్‌కు తెలియాలనే ఇన్స్పిరేషన్తో ఈ సినిమాను చేశాం. శ్రీకాకుళంలోని తండేల్స్ నా రియల్ హీరోస్. అరవింద్‌గారు, బన్నీవాస్‌గారికి థాంక్స్.”
“అరవింద్గారితో నా జర్నీ 100% లవ్ సినిమాతో ప్రారంభమయ్యాను. ఆ సినిమా రిలీజ్ తర్వాత నటుడిగా నాకు పాజిటివ్ ఎనర్జీ వచ్చింది. ఇప్పుడు మరోసారి ఆయనతో కలిసి వర్క్ చేయటం గొప్ప అనుభూతినిచ్చింది. అలాగే ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ నిజమైన రాక్‌స్టార్. లవ్ స్టోరికీ అద్భుమైన మ్యూజిక్ ఉండాలి. దేవిశ్రీ సాంగ్స్ రిలీజైన తర్వాత సినిమాపై హైప్స్ నెక్ట్స్ రేంజ్‌కు పెరిగిపోతూ వచ్చాయి. పాటలు అంత గొప్పగా చార్ట్ బస్టర్స్ అయ్యాయి.”
“సాయి పల్లవి ఎంతో స్పెషల్. ప్రతీ ఒక్కరూ ఆమెతో వర్క్ చేయాలనుకుంటారు. ‘లవ్‌స్టోరీ’ తర్వాత తండేల్‌లో సాయి పల్లవితో కలిసి నటించటం మరచిపోలేని జర్నీ. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ అంటే ఓ బ్రాండ్. తండేల్ సినిమాను ఇక్కడ డిస్ట్రిబ్యూట్ చేస్తున్న వారికి స్పెషల్ థాంక్స్. భవిష్యత్తులో వారితో కలిసి పని చేయాలనుకుంటున్నాను. నరేన్గారికి, కరుణాకరన్‌గారికి థాంక్స్. వివేకన్‌గారు చక్కటి లిరిక్స్ అందించారు. ఫిబ్రవరి 7న తండేల్ సినిమా రిలీజ్ అవుతుంది. అందరూ సినిమాను థియేటర్స్‌లో చూసి ఎంజాయ్ చేస్తారు’’ అని అన్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























