‘అర్జున్ రెడ్డి’, ‘కబీర్ సింగ్’, ‘యానిమల్’ వంటి భారీ పాన్-ఇండియా బ్లాక్‌బస్టర్స్‌తో ఇండియన్ సినిమా ఇండస్ట్రీని ఊపేసిన అగ్ర దర్శకుడు సందీప్ రెడ్డి వంగా సమర్పకుడిగా ఒక సరికొత్త చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఆయన సోదరుడు ప్రణయ్ రెడ్డి వంగా నిర్మిస్తున్న ఈ తాజా చిత్రానికి ‘రోమాంచకం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్ పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. ‘మేమ్ ఫేమస్’ చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో సుమంత్ ప్రభాస్, ‘మ్యాడ్’ ఫేమ్ బ్యూటీ అనంతిక సనీల్ కుమార్ ఈ సినిమాలో జంటగా నటిస్తున్నారు.
యూత్‌ఫుల్ అండ్ పొయెటిక్ ఫీల్‌తో డిజైన్ చేసిన ఈ టైటిల్ పోస్టర్ నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.ఈ పోస్టర్‌కు జోడించిన “ప్రేమ, హాస్యం, ఉత్కంఠ” అనే ట్యాగ్‌లైన్ కథపై మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఎంతో వైవిధ్యమైన ఈ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ చిత్రం ద్వారా వేణు గోపాల్ రెడ్డి దర్శకుడిగా టాలీవుడ్‌కు పరిచయమవుతున్నారు.ఈ చిత్రాన్ని సందీప్ రెడ్డి వంగా హోమ్ బ్యానర్ అయిన భధ్రకాళి పిక్చర్స్ పై ప్రణయ్ రెడ్డి వంగా, భూషణ్ కుమార్, క్రిషన్ కుమార్, ప్రభాకర్ రెడ్డి వంగా సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
నవ్యత కలబోసిన సరికొత్త ప్రేమకథా చిత్రమిదని, ప్రతి ఒక్కరినీ అలరించేలా దర్శకుడు దీనిని అద్భుతంగా తెరకెక్కిస్తున్నారని మేకర్స్ తెలిపారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమయె, వెంకటేష్ కాకుమాను, నరేంద్ర రవి తదితరులు కీలక పాత్రలు పోషిస్తుండగా.. పాపులర్ కంపోజర్ వాసుకి వైభవ్ సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని క్రేజీ అప్‌డేట్స్‌ను పంచుకోనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























