యూఎస్ బాక్సాఫీస్ వద్ద పెద్ది ఊచకోత

Peddi Joins the $1 Million Club at the USA Box Office

రిలీజ్ కాకుండానే మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి!గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుండగా, యునైటెడ్ స్టేట్స్ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా విడుదలకు ముందే సరికొత్త రికార్డు సృష్టించింది.జూన్ 3న జరగబోయే గ్రాండ్ ఓవర్సీస్ ప్రీమియర్ షోల కోసం టికెట్ బుకింగ్స్ ఓపెన్ చేయగా.. కేవలం ముందస్తు సేల్స్ రూపంలోనే ఈ చిత్రం ఏకంగా 1 మిలియన్ డాలర్ల మైలురాయిని దాటేసి సరికొత్త రికార్డు క్రియేట్ చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సాధారణంగా సినిమాలు రిలీజ్ అయ్యాక వారం రోజులకు మిలియన్ డాలర్ల మార్కును అందుకుంటాయి. కానీ, ‘పెద్ది’ సినిమాకు ఉన్న విపరీతమైన క్రేజ్ కారణంగా ఒక్క ప్రీ-సేల్స్ ద్వారానే రిలీజ్‌కు ముందే ఈ ల్యాండ్‌మార్క్‌ను దాటేసింది. నార్త్ అమెరికా ర్యాంపేజ్: నార్త్ అమెరికాలో ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ ప్రత్యంగిరా సినిమాస్’ ఈ చిత్రాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా మరియు భారీ స్థాయిలో రిలీజ్ చేస్తోంది. అడ్వాన్స్ బుకింగ్స్ విండో ఓపెన్ అయినప్పటి నుంచే మెగా ఫ్యాన్స్ టికెట్ల కోసం ఎగబడ్డారు.

ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం, ప్రీమియర్ల ద్వారానే మిలియన్ డాలర్లు దాటడంతో.. మొదటి రోజు ముగిసే సమయానికి ఓవర్సీస్ మార్కెట్‌లో ఈ సినిమా ఎవరూ ఊహించని రేంజ్‌లో భారీ వసూళ్లను రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకవైపు యూఎస్‌లో మిలియన్ డాలర్ల క్లబ్‌లోకి అడుగుపెట్టగా.. మరోవైపు తెలుగు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో కూడా ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్స్ జోరందుకున్నాయి .ఇప్పటికే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు భారీ టికెట్ రేట్ల పెంపుతో పాటు, అదనపు షోలు మరియు జూన్ 3 రాత్రికే స్పెషల్ ప్రీమియర్ షోలకు అనుమతులు ఇవ్వడంతో బాక్సాఫీస్ వద్ద తొలిరోజే ‘పెద్ది’ సునామీ సృష్టించడం ఖాయంగా కనిపిస్తోంది. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రానికి ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ అద్భుతమైన సంగీతాన్ని అందించారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.