గొప్ప విజన్ తో స్క్రిప్ట్‌లను ఎంచుకునే అసాధారణ సామర్ధ్యం గల మెగాస్టార్ చిరంజీవి, తన ప్రముఖ కెరీర్‌లో ప్రతిభావంతులు, డెబ్యుటెంట్ ఫిల్మ్ మేకర్స్‌తో పనిచేశారు. ప్రామెసింగ్ ఫిల్మ్ మేకర్స్‌ని గుర్తించి, వారి ఎదుగుదలకు దోహదపడం మెగాస్టార్ స్పెషాలిటీలో ఒకటి. ఇదే క్రమంలో తాజాగా చిరంజీవి తన నెక్స్ట్ ప్రాజెక్ట్ మెగాస్టార్‌కి వీరాభిమాని అయిన అత్యంత ప్రతిభావంతుడైన దర్శకుడు శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో చేస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇది ఒక కొత్త అధ్యాయాన్ని సూచిస్తుంది. తొలి చిత్రం ‘దసరా’తో భారీ బ్లాక్‌బస్టర్ ఇచ్చిన దర్శకుడు, భారీ కమర్షియల్ విజయాన్ని సాధించడమే కాకుండా, అనేక ప్రతిష్టాత్మకమైన అవార్డులను గెలుచుకుని ప్రశంసలు పొందారు. ఈ రోజు అధికారికంగా ఈ ప్రాజెక్ట్‌ని అనౌన్స్ చేశారు. శ్రీకాంత్ ఒదెల, మెగాస్టార్‌తో తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌ను చేపట్టడంతో ఈ కొలాబరేషన్ మరో స్థాయికి చేరింది.
తాజాగా విడుదలైన అఫీషియల్ పోస్టర్ చిరంజీవి పాత్ర ఇంటెన్స్ తెలియజేస్తూ సినిమా పవర్ ఫుల్ నేచర్‌ని ప్రజెంట్ చేస్తోంది. పోస్టర్‌లోని అద్భుతమైన ఎరుపు రంగు థీమ్ కథకు ప్రధానమైన వైలెన్స్ ని సూచిస్తుంది. “He finds his peace in violence” అనే కోట్ చిరంజీవి పోషించబోయే ఫెరోషియస్ స్ట్రాంగ్ క్యారెక్టర్‌ని తెలియజేస్తోంది. ఈ కోలబారేషన్ హై- ఆక్టేన్, థ్రిల్లింగ్ సినిమాటిక్ అనుభూతిని కలిగిస్తుంది. ఇది చిరంజీవికి మోస్ట్ వైలెంట్ మూవీ కానుంది.
నేచురల్ స్టార్ నాని అనానిమస్ ప్రొడక్షన్స్ సమర్పణలో ఎస్‌ఎల్‌వి సినిమాస్‌పై సుధాకర్ చెరుకూరి భారీ ఎత్తున ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. కాగా దర్శకుడు శ్రీకాంత్ ఒదెల, నేచురల్ స్టార్ నానితో తెరకెక్కిస్తున్న ‘ది ప్యారడైజ్’ చిత్రం పూర్తయిన తర్వాత ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. ఇక ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు మేకర్స్ త్వరలో తెలియజేయనున్నారు. ఈ సందర్భంగా హీరో నాని ఎక్స్ వేదికగా తన సంతోషాన్ని పంచుకున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: