యువ నటుడు హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలై జంటగా నటించిన క్రేజీ లవ్ అండ్ రొమాంటిక్ డ్రామా ‘దీవానా’ డిజిటల్ విడుదల తేదీ ఖరారైంది. థియేటర్లలో విడుదలైన తర్వాత మిశ్రమ స్పందనతో పాటు మంచి ప్రశంసలు అందుకున్న ఈ చిన్న చిత్రం, ఇప్పుడు ఓటీటీ ద్వారా డిజిటల్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ప్రముఖ ప్రాంతీయ ఓటీటీ ప్లాట్‌ఫామ్ ‘ఆహా’ ఈ చిత్ర డిజిటల్ హక్కులను సొంతం చేసుకోగా, ఈ రోజు నుంచి అధికారికంగా స్ట్రీమింగ్ లోకి వచ్చేసింది. ఆహా గోల్డ్ సబ్‌స్క్రైబర్లకు మాత్రం నిన్నటి నుంచే ముందస్తుగా ఈ చిత్రం అందుబాటులోకి వచ్చింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళ భాషలోనూ ఆహాలో అందుబాటులో ఉంది.
నవదర్శకుడు శ్రీకాంత్ సంగిశెట్టి తెరకెక్కించిన ఈ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ పతాకంపై వాసుదేవ్ కొప్పినేని, శ్రీదేవి కార్యంపూడి సంయుక్తంగా నిర్మించారు. ఒక స్వచ్ఛమైన పల్లెటూరి ప్రేమకథ, కుటుంబ భావోద్వేగాలు మరియు వినూత్నమైన మలుపులతో ఈ సినిమాను రూపొందించారు.
హర్షిత్ రెడ్డి, స్మేహా మణిమేఘలైలతో పాటు సీనియర్ నటులు నరేష్, ఝాన్సీ, ‘బలగం’ వేణు, జీవన్ కుమార్ కీలక పాత్రల్లో నటించారు.థియేటర్లలో మిస్ అయిన ప్రేక్షకులు, మంచి యూత్‌ఫుల్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామాను వీక్షించాలనుకునేవారు ఈ వీకెండ్‌లో ‘ఆహా’లో ఈ చిత్రాన్ని వీక్షించవచ్చు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























