మోహన్ రాజా డైరెక్షన్‌లో సినిమా చేస్తున్న కార్తి

Karthi Joins Hands with Director Mohan Raja

ప్రిన్స్ పిక్చర్స్ మరో క్రేజీ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించింది. హీరో కార్తి , ప్రముఖ దర్శకుడు మోహన్ రాజా కాంబినేషన్‌లో కొత్త సినిమా అనౌన్స్ చేసింది. ఎస్. లక్ష్మణ్ కుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం కుటుంబ భావోద్వేగాలతో పాటు హీరోయిజాన్ని అద్భుతంగా మేళవించిన ఎంటర్‌టైనర్‌గా రూపొందనుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కార్తి ,, మోహన్ రాజా కలిసి పనిచేయడం ఇదే తొలిసారి. ప్రిన్స్ పిక్చర్స్ బ్యానర్‌లో కార్తికి ఇది వరుసగా నాలుగో చిత్రం. ఇంతకుముందు ‘దేవ్’, ‘సర్దార్’, ‘సర్దార్ 2’ చిత్రాల తర్వాత మరోసారి ఈ బ్యానర్‌తో ఆయన చేతులు కలపడం విశేషం. ముఖ్యంగా ‘సర్దార్ 2’ విడుదలకంటే ముందే ఈ కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించడం కార్తి ,, ప్రిన్స్ పిక్చర్స్ మధ్య ఉన్న బలమైన అనుబంధానికి నిదర్శనం. ఈ సినిమాపై కేవలం ప్రకటనతోనే సినీ అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

బలమైన భావోద్వేగాలు, కమర్షియల్ ఎలిమెంట్స్‌ను మేళవిస్తూ మంచి సినిమాలు తెరకెక్కించే దర్శకుడిగా పేరు తెచ్చుకున్న మోహన్ రాజా, ఈ చిత్రంలో కార్తిని మరో కొత్త, పవర్‌ఫుల్ అవతార్‌లో చూపించబోతున్నారు.

ఈ చిత్రానికి సంబంధించిన నటీనటులు, సాంకేతిక బృందం, రెగ్యులర్ షూటింగ్ తదితర వివరాలను మేకర్స్ త్వరలోనే అధికారికంగా ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.