లిటిల్ హార్ట్స్ మౌళి నెక్స్ట్ మూవీ దొంగ నా కొడుకు

Little Hearts’ Fame Mouli’s Next Film Titled Donga Naa Koduku

ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ పెద్ద స్టార్ హీరోలతో గ్రాండ్ ఎంటర్‌టైనర్స్ చేస్తూనే, మరోవైపు కొత్త టాలెంట్‌తో కంటెంట్ బేస్డ్  సినిమాలను నిర్మిస్తోంది. తాజాగా మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. ‘లిటిల్ హార్ట్స్’ చిత్రంతో ప్రశంసలు అందుకున్న మౌళి తనూజ్ ప్రసాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో శ్రీను కంబాల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా మేకర్స్ ఈ సినిమా ‘దొంగ నా కొడుకు’ అనే క్రేజీ టైటిల్‌తో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

‘దొంగ నా కొడుకు’ అనే టైటిల్ వినగానే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వినూత్నంగా డిజైన్ చేసిన లోగో సినిమా ఫన్, ఎంటర్‌టైనింగ్ టోన్‌ను పరిచయం చేస్తోంది. ఇక ఫస్ట్ లుక్ పోస్టర్‌లో భారీ జాక్ ప్లేయింగ్ కార్డ్ నుంచి చిరునవ్వుతో స్టైలిష్‌గా ఎంట్రీ ఇస్తున్న మౌళి లుక్ ఆకట్టుకుంటోంది. ఆయన బాడీ లాంగ్వేజ్ చూస్తుంటే… సరదా మనస్తత్వం ఉన్న యువకుడు వరుసగా జరిగే కామెడీ, దొంగతనాల నేపథ్యంలో సాగే థ్రిల్లింగ్ సంఘటనల్లో చిక్కుకోబోతున్నాడనే ఆసక్తిని కలిగిస్తోంది. ప్లేయింగ్ కార్డ్ కాన్సెప్ట్ సినిమాకు   యూనిక్ విజువల్ ఐడెంటిటీని తీసుకొచ్చింది.

పోస్టర్‌లో కనిపించే బ్లాక్ బ్యాక్‌ప్యాక్, చెల్లాచెదురుగా పడిన బంగారు నగలు, గాలిలో ఎగురుతున్న కాగితాల ముక్కలు వంటి విజువల్ ఎలిమెంట్స్ కథలోని దొంగతనం కాన్సెప్ట్‌ను ఆసక్తికరంగా సూచిస్తున్నాయి. ఈ క్రియేటివ్ పోస్టర్ సినిమాపై మరింత క్యూరియాసిటీ పెంచుతోంది.

ఈ చిత్రాన్ని నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తుండగా, అనిల్ ఎర్నేని సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంలో సుష్మిత శెట్టి, అలీ, రాజిత, రఘుబాబు, ప్రియ, గుండు సుధర్షన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

ఈ చిత్రానికి సూర్య బాలాజీ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, సింజిత్ యర్రమిల్లి సంగీతం సమకూరుస్తున్నారు. శ్రీధర్ సోంపల్లి ఎడిటర్‌గా, నాగేంద్ర గువ్వల ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేస్తున్నారు.

వినగానే గుర్తుండిపోయే టైటిల్, క్రియేటివ్ ఫస్ట్ లుక్ పోస్టర్‌తో ‘దొంగ నా కొడుకు’ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. సినిమా గురించి మరిన్ని వివరాలను మేకర్స్ త్వరలోనే వెల్లడించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.