గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ హీరోగా, బ్లాక్ బస్టర్ డైరెక్టర్ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న లేటెస్ట్ మూవీ ‘డాకు మహారాజ్’. గత కొన్నేళ్లుగా అపజయమనేదే లేకుండా వరుస భారీ విజయాలతో దూసుకుపోతున్న బాలయ్య, తన 109వ చిత్రంగా దీనిని తీసుకొస్తున్నారు. ఇటీవలే కార్తీక పూర్ణిమ శుభ సందర్భంగా ఈ చిత్రం టైటిల్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ సందర్భంగా విడుదల చేసిన డాకు మహారాజ్ టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. ‘డాకు మహారాజ్’గా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులకు పూనకాలు తెప్పించేలా ఉంది. తమన్ నేపథ్య సంగీతం టీజర్‌ని మరోస్థాయికి తీసుకెళ్లింది. టీజర్ లోని ప్రతి ఫ్రేమ్‌లో భారీతనం కనిపించింది. విజువల్స్ అద్భుతంగా ఉన్నాయి.
కాగా బాలయ్య ఇందులో బందిపోటు పాత్రలో కనిపించనున్నట్టు సమాచారం. అందుకే దీనిని సూచించేలా ఈ టైటిల్ పెట్టినట్టు తెలుస్తోంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే, బాలకృష్ణతో కలిసి దర్శకుడు బాబీ థియేటర్లలో ప్రేక్షకులను సరికొత్త అనుభూతిని అందించే భారీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ను అందించబోతున్నారని అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్రం నుంచి కీలక అప్‌డేట్ వచ్చింది.
నాన్ స్టాప్ షెడ్యూళ్లతో చిత్రీకరణ జరుపుకున్న ఈ సినిమాకు చిత్ర బృందం గుమ్మడికాయ కొట్టేసింది. ఈ మేరకు మూవీ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయినట్టు చిత్ర యూనిట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. ఈ సందర్భంగా ‘డాకు ఇన్ యాక్షన్’ పేరుతో చిత్రీకరణ సమయంలోని ఒక ఫొటోని విడుదల చేశారు నిర్మాతలు. ఆ ఫొటోలో దర్శకుడు బాబీ కీలక సన్నివేశం గురించి వివరిస్తుండగా, బాలకృష్ణ శ్రద్ధగా వింటూ కనిపించారు. షూటింగ్ పార్ట్ ముగియడంతో పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలపై దృష్టి సారించనుంది టీమ్.
ఇక ఈ చిత్రంలో బాలీవుడ్ నటి ఊర్వశి రౌటేలా, శ్రద్దా శ్రీనాథ్ ఫీమేల్ లీడ్ రోల్స్ పోషిస్తుండగా.. ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ కీలక పాత్ర పోషిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్‌ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తుండగా.. శ్రీకర స్టూడియోస్ సమర్పిస్తోంది. ప్రముఖ ఛాయాగ్రాహకుడు విజయ్ కార్తీక్ కన్నన్ కెమెరా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కళా దర్శకుడిగా అవినాష్ కొల్లా, ఎడిటర్ గా నిరంజన్ దేవరమానే వ్యవహరిస్తున్నారు.
కాగా అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోన్న డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి కానుకగా 2025, జనవరి 12న ప్రపంచవ్యాప్తంగా భారీస్థాయిలో విడుదల కానుంది. బ్లాక్ బస్టర్ హిట్ ‘భగవంత్ కేసరి’ చిత్రం తర్వాత బాలయ్య నటిస్తోన్న చిత్రం కావడం.. అలాగే ‘వాల్తేర్ వీరయ్య’ వంటి సాలిడ్ హిట్ తర్వాత బాబీ దర్శకత్వంలో వస్తోన్న సినిమా కావడంతో డాకు మహారాజ్ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: