కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

శ్రీనివాస మంగాపురం · రివ్యూ

Srinivasa Mangapuram review in telugu
రివ్యూ

రివ్యూ: శ్రీనివాస మంగాపురం

Srinivasa Mangapuram review in telugu

ఒక్క మాటలో

మొత్తంగా చూస్తే.. శ్రీనివాస మంగాపురం అనేది ఒక పక్కా కమర్షియల్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. రొటీన్ మాస్ ఎలిమెంట్స్ పక్కన పెడితే జై కృష్ణ గ్రాండ్ ఎంట్రీ, జీవీ ప్రకాష్ సంగీతం మరియు మాస్ హంగుల కోసం కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఒకసారి చూడవచ్చు.

Srinivasa Mangapuram review in telugu
రివ్యూ

రివ్యూ: శ్రీనివాస మంగాపురం

Srinivasa Mangapuram review in telugu

ఒక్క మాటలో

మొత్తంగా చూస్తే.. శ్రీనివాస మంగాపురం అనేది ఒక పక్కా కమర్షియల్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. రొటీన్ మాస్ ఎలిమెంట్స్ పక్కన పెడితే జై కృష్ణ గ్రాండ్ ఎంట్రీ, జీవీ ప్రకాష్ సంగీతం మరియు మాస్ హంగుల కోసం కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఒకసారి చూడవచ్చు.

దర్శకత్వంఅజయ్ భూపతినిర్మాతజెమినీ కిరణ్ , అశ్వినీ దత్

సూపర్ స్టార్ కృష్ణ గారి మనవడు, రమేష్ బాబు కుమారుడు జై కృష్ణ ఘట్టమనేని కథానాయకుడిగా, బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడానీ కథానాయికగా పరిచయమైన చిత్రం ‘శ్రీనివాస మంగాపురం’. ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ చిత్రాల దర్శకుడు అజయ్ భూపతి తెరకెక్కించిన ఈ యాక్షన్ లవ్ డ్రామా, వైజయంతీ మూవీస్ సమర్పణలో ప్రసాద్ కిరణ్ నిర్మించగా ఈరోజే ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి వచ్చింది. మరి ఈ సినిమా ఘట్టమనేని అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను ఏ మేరకు మెప్పించిందో రివ్యూలో చూద్దాం!

01కథ

తిరుపతికి చెందిన పెద్దమనిషి పెద్దిరెడ్డి (కిక్ శ్యామ్) కుమార్తె మంగ (రాషా తడానీ)ని చూసి తొలిచూపులోనే ప్రేమిస్తాడు శ్రీను అలియాస్ వాసు (జై కృష్ణ). ఎలాగైనా ఆమె మనసు గెలుచుకోవాలని ఆరాటపడే శ్రీను, అనుకోకుండా పెద్దిరెడ్డి కుటుంబానికి సంబంధించిన ఒక గొడవలో జోక్యం చేసుకుని వారి నమ్మకాన్ని పొందుతాడు. అయితే శ్రీను సాధారణ యువకుడు కాదు.. బళ్లారికి చెందిన బలమైన నాయకుడు వెంకటప్పయ్య నాయుడు (మోహన్ బాబు) మనవడు. అసలు తిరుపతికి శ్రీను ఎందుకు వచ్చాడు? మంగ వెంట పడటానికి వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? వీరి ప్రేమకథకు ఫ్యామిలీ ఫ్యాక్షన్ ఏ విధంగా అడ్డంకిగా మారింది? అనేదే మిగతా సినిమా కథ.

02విశ్లేషణ

దర్శకుడు అజయ్ భూపతి తన గత చిత్రాలైన ‘ఆర్‌ఎక్స్ 100’, ‘మంగళవారం’ తరహాలో డార్క్ అండ్ రా ఎలిమెంట్స్ జోలికి వెళ్లకుండా, ఈసారి పక్కా వింటేజ్ కమర్షియల్ ఫార్మాట్ ఎంచుకున్నారు.ఫస్ట్ హాఫ్ అంత తిరుపతి బ్యాక్‌డ్రాప్‌లో హీరో-హీరోయిన్ల మధ్య లవ్ ట్రాక్, లైట్-హార్టెడ్ కామెడీతో చాలా వేగంగా, ఆసక్తికరంగా సాగిపోతుంది.

ఇక సెకండ్ హాఫ్ లో రాయలసీమ/బళ్లారి ఫ్యాక్షన్ ఎమోషన్స్, మోహన్ బాబు ఎంట్రీతో ఊపందుకున్నప్పటికీ.. కథనం కొంత రొటీన్ గా సాగడం వల్ల రెగ్యులర్ అనిపిస్తుంది. అయితే మాస్ ఆడియన్స్‌కు కావలసిన ఫైట్స్, హై-వోల్టేజ్ సీన్స్ సరిపడా అందించడంలో దర్శకుడు సఫలమయ్యారు.

03నటీనటులు

జై కృష్ణ ఘట్టమనేని తొలి చిత్రమే అయినా జై కృష్ణ స్క్రీన్ ప్రెజెన్స్, మాస్ లుక్స్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్ ఘట్టాలు, డ్యాన్సుల్లో ఎంతో ఈజ్‌తో నటించి ఘట్టమనేని అభిమానులకు మంచి విందు అందించాడనే చెప్పాలి. మంగ పాత్రలో రాషా చూడటానికి బాగుంది, తన పరిధి మేర ఆకట్టుకుంది. ఇతర పాత్రలు: మోహన్ బాబు గారు తనదైన విలక్షణమైన మేనరిజం, వాయిస్ బేస్‌తో వెంకటప్పయ్య నాయుడు పాత్రకి ప్రాణం పోశారు. కిక్ శ్యామ్, నరేష్, బ్రహ్మాజీ, అజయ్ తమ పాత్రల పరిధి మేరకు మెప్పించారు.

04సాంకేతికం

దర్శకుడు అజయ్ భూపతి ఒక డెబ్యూ హీరోకి కావలసినన్ని కమర్షియల్ హంగులు జోడిస్తూ కథనాన్ని నడిపించారు. జి.వి. ప్రకాష్ కుమార్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాలోని కీలక సీన్లలో బాగా వర్కౌట్ అయింది. తిరుపతి, బళ్లారి అందాలను కెమెరామెన్ జయకృష్ణ గుమ్మడి విజువల్‌గా చాలా అందంగా చూపించారు.

TFN మాట

మొత్తంగా చూస్తే.. శ్రీనివాస మంగాపురం అనేది ఒక పక్కా కమర్షియల్ మాస్ అండ్ ఎమోషనల్ లవ్ డ్రామా. రొటీన్ మాస్ ఎలిమెంట్స్ పక్కన పెడితే జై కృష్ణ గ్రాండ్ ఎంట్రీ, జీవీ ప్రకాష్ సంగీతం మరియు మాస్ హంగుల కోసం కమర్షియల్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాను థియేటర్లలో ఒకసారి చూడవచ్చు.

వాట్సాప్‌లో షేర్ చేయండి

ఈవెంట్ & ఇంటర్వ్యూ వీడియోలు

ఈ సినిమాకు సంబంధించిన TFN వీడియోలు

మీరైతే ఎన్ని మార్కులు వేస్తారు?

సినిమా చూసినవాళ్లు మాత్రమే

నటీనటులు

జజయకృష్ణ ఘట్టమనేని
రారాషా తడానీ
మోమోహన్ బాబు
అఅజయ్

టెక్నీషియన్స్

దర్శకత్వం
అజయ్ భూపతి
సినిమాటోగ్రఫీ
జయకృష్ణ గుమ్మడి
ఎడిటింగ్
మాధవ్ కుమార్ గుళ్ళపల్లి
నిర్మాత
జెమినీ కిరణ్ , అశ్వినీ దత్

మరిన్ని రివ్యూస్

అన్నీ
DNK Telugu Movie Review

DNK

DNK

రివ్యూ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్