ఇండియాలో స్పైడర్ మ్యాన్ సంచలనం

Spider-Man Enters the ₹300 Crore Club in India

హాలీవుడ్ సూపర్ హీరో మూవీ ‘స్పైడర్ మ్యాన్: బ్రాండ్ న్యూ డే’ భారతీయ బాక్సాఫీస్ వద్ద తన ఆధిపత్యాన్ని నిరూపించుకుంది. మొదటి రోజు నుంచే తుఫాను వసూళ్లతో దూసుకెళ్లిన ఈ చిత్రం, 4రోజుల్లో దేశవ్యాప్తంగా విజయవంతంగా రూ. 300 కోట్ల గ్రాస్ కలెక్షన్ల క్లబ్‌లో అడుగుపెట్టి సరికొత్త చరిత్ర సృష్టించింది.3రోజుల్లో ఈసినిమా ఇండియన్ బాక్సాఫీస్ వద్ద 309కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హాలీవుడ్ స్టార్స్ టామ్ హోలాండ్, జెండయా జంటగా నటించిన ఈ చిత్రానికి ఇండియాలో మాస్, క్లాస్ అనే తేడా లేకుండా ఆడియన్స్ బ్రహ్మరథం పట్టారు. విడుదలైన నాటి నుంచి హౌస్‌ఫుల్ కలెక్షన్లతో రన్ అవుతున్న ఈ సినిమా, అతి తక్కువ సమయంలోనే రూ. 300 కోట్ల మైలురాయిని దాటిన హాలీవుడ్ చిత్రాల సరసన చేరింది.

ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఈ మూవీ అత్యధిక ఆక్యుపెన్సీని నమోదు చేసింది. అద్భుతమైన విజువల్ ఎఫెక్ట్స్, మైండ్ బ్లోయింగ్ యాక్షన్ సీన్స్ మరియు ఎమోషనల్ కంటెంట్ ఈ రేంజ్ బాక్సాఫీస్ సునామీకి కారణమని ట్రేడ్ వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మైలురాయితో భారతీయ బాక్సాఫీస్ దగ్గర హాలీవుడ్ సినిమాల సత్తాను స్పైడర్ మ్యాన్ మరోసారి చాటి చెప్పింది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.