సూపర్ స్టార్ మహేష్ బాబు కెరీర్లోనే బిగ్గెస్ట్ మైలురాయిగా నిలిచిన ఇండస్ట్రీ హిట్ మూవీ ‘దూకుడు’ మళ్లీ థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. శ్రీను వైట్ల దర్శకత్వంలో 2011లో వచ్చిన ఈ అవుట్ అండ్ అవుట్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్, టాలీవుడ్ బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసిన సంగతి తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా ఈ సినిమా రీ-రిలీజ్ ముహూర్తాన్ని మేకర్స్ అధికారికంగా ఖరారు చేశారు. ప్రిన్స్ మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా 4K క్వాలిటీ మరియు 5.1 విజువల్స్ సాంకేతికతతో గ్రాండ్‌గా రీ-రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
మహేష్ బాబు టైమింగ్ కామెడీ, కమనీయమైన డైలాగ్ డెలివరీ, సమంత గ్లామర్, బ్రహ్మానందం సపరేట్ కామెడీ ట్రాక్ మరియు ఎస్. థమన్ అందించిన చార్ట్‌బస్టర్ ఆల్బమ్ బిగ్ స్క్రీన్‌పై మరోసారి ప్రేక్షకులకు పూనకాలు తెప్పించడం ఖాయంగా కనిపిస్తోంది. సూపర్ స్టార్ అభిమానులు ఈ రీ-రిలీజ్ హంగామా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























