నేషనల్ క్రష్ రష్మిక మందన్న, టాలెంటెడ్ హీరో దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న సినిమా ‘ది గర్ల్ ఫ్రెండ్’. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో గీతా ఆర్ట్స్, మాస్ మూవీ మేకర్స్, ధీరజ్ మొగిలినేని ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. బ్యూటిఫుల్ లవ్ స్టోరీతో దర్శకుడు రాహుల్ రవీంద్రన్ రూపొందిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
ధీరజ్ మొగిలినేని, విద్య కొప్పినీడి నిర్మాతలుగా వ్యవహిస్తున్న ది గర్ల్ ఫ్రెండ్ సినిమా టీజర్ త్వరలో రిలీజ్ చేయబోతున్నారు. ఈ క్రమంలో తాజాగా ఈ మూవీ టీజర్‌పై ప్రశంసలు కురిపించారు సెన్సేషనల్ డైరెక్టర్ సుకుమార్. ఈ మేరకు రీసెంట్‌గా నిర్వహించిన పుష్ప 2 ఈవెంట్‌లో టీజర్ చూశానని, చాలా అద్భుతంగా ఉందని ఆయన అప్రిషియేట్ చేశారు.
ఈ సందర్భంగా డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ.. “డైరెక్టర్ రాహుల్ ది గర్ల్ ఫ్రెండ్ టీజర్ చూపించాడు. రష్మిక పర్ఫార్మెన్స్, క్లోజప్ షాట్స్, ఎక్స్‌ప్రెషన్స్ చాలా బాగున్నాయి. రాహుల్ తన యాక్టర్స్‌ను బాగా సెలెక్ట్ చేసుకుంటాడు” అని అన్నారు. కాగా వైవిధ్యమైన ప్రేమ కథా చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం చివరి దశ షూటింగ్‌లో ఉంది.
ఇక ది గర్ల్ ఫ్రెండ్ చిత్రం కోసం టాప్ టెక్నిషియన్స్ పనిచేస్తున్నారు. కృష్ణన్ వసంత్ సినిమాటోగ్రఫీ నిర్వహిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ హేషమ్ అబ్దుల్ వాహబ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే శ్రావ్య వర్మ కాస్ట్యూమ్స్ అందిస్తుండగా.. ఎస్ రామకృష్ణ, మౌనిక నిగోత్రి సంయుక్తంగా ప్రొడక్షన్ డిజైన్ విభాగాన్ని చూసుకుంటున్నారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: