ఈ నిశ్చితార్థ వేడుకకు కొణిదెల మరియు అల్లు కుటుంబాలు పెద్ద ఎత్తున హాజరై సందడి చేశాయి. మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్, అల్లు అర్జున్, నాగబాబు, నిహారికలతో పాటు పవన్ కల్యాణ్ పిల్లలు అకీరా నందన్, ఆద్య కూడా హాజరై కాబోయే జంటను ఆశీర్వదించారు. మెగా, అల్లు కుటుంబ సభ్యులంతా ఒకే ఫ్రేమ్‌లో ఉన్న ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియా వేదికగా పంచుకుంటూ #KiranTejForever హ్యాష్‌ట్యాగ్‌తో కొత్త జంటకు ప్రత్యేక అభినందనలు తెలిపారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇరు కుటుంబాల పెద్దల అంగీకారంతో వీరి వివాహం 2026 డిసెంబర్ 10న హైదరాబాద్‌లోనే అత్యంత ఘనంగా జరగనుంది. సినీ పరిశ్రమ నుంచి మంచు మనోజ్, భూమా మౌనిక, నవదీప్, హర్ష చెముడు, దర్శకుడు వెంకీ కుడుముల తదితరులు కూడా ఈ వేడుకలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఎంగేజ్‌మెంట్ ఫొటోలు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:


























