సరోజ్ కుమార్ స్వీయ నిర్మాణంలో రానున్న ఛప్రి

First Look of Saroj Kumar’s Chapri Is Out

‘మాంగళ్యం’, ‘పరాక్రమం’, ‘నిర్భంధం’ వంటి చిత్రాలతో తనలోని విలక్షన నటుడ్ని అందరికీ పరిచయం చేసుకున్నాడు సరోజ్ కుమార్. ఆయన నటన, మేకింగ్, టేకింగ్ అంటే ఓ వర్గానికి చెందిన ప్రేక్షకులకు ఎంతో ఇష్టం. ప్రస్తుతం సరోజ్ మరో వినూత్న కాన్సెప్ట్‌తో ఆడియెన్స్‌ని ఆకట్టుకునేందుకు రెడీ అయ్యారు. సరోజ్ ప్రధాన పాత్రల్లో రానున్న నూతన చిత్రం ‘ఛప్రి’. ఈ మూవీకి స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్, లిరిక్స్, ఎడిటింగ్, మ్యూజిక్, దర్శకత్వం ఇలా అన్ని బాధ్యతల్ని సరోజ్ నిర్వర్తించారు. BSK మెయిన్ స్ట్రీమ్ బ్యానర్ మీద సరోజ్, ప్రమోద్ పడమటి, పృథ్వీ చౌహాన్ నిర్మించిన ఈ సినిమాలో సరోజ్‌తో పాటుగా ఐశ్వర్య బోరా, దివ్య జ్యోతి, శ్లోకా, ప్రవీన్, మోహన్ ఆర్య, జీవా బాలచందర్, ప్రియాంక సింగ్ తదితరులు కీలక పాత్రలను పోషించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

స్లమ్‌లో ఉండే ఓ కుర్రాడు.. అతడి ప్రేమ ప్రయాణం.. ఆ జర్నీలో కొంత మంది డబ్బున్న వ్యక్తులు ఎదురు పడటం, వారి వల్ల అతని జీవితం తలకిందులు అవ్వడం అనే ఆసక్తికరమైన పాయింట్స్‌తో ‘ఛప్రి’ మూవీని తెరకెక్కించారు. ప్రేమ చుట్టూ తిరిగే ఈ కథలో చివరకు ఏం జరుగుతుంది? అనేది ఇంట్రెస్టింగ్‌గా ఉంటుంది. అతని ప్రేమలో విజయం సాధిస్తాడా? లేదా? అన్నది ‘ఛప్రి’ మూల కథ. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్‌ని తాజాగా విడుదల చేశారు.

‘ఛప్రి’ ఫస్ట్ లుక్‌లో సరోజ్ చాలా కొత్తగా కనిపిస్తున్నారు. స్లమ్ కుర్రాడిలా రా అండ్ రస్టిక్‌గా కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌ని గమనిస్తుంటే ఫుల్ యాక్షన్ మోడ్‌లో హీరో కనిపిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించిన ఇతర వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.