తెలుగులో అత్యంత ఆదరణ పొందుతున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్ తెలుగు సీజన్ 10’ లో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. తన దూకుడు, ఆటతీరుతో బలమైన పోటీదారుడిగా గుర్తింపు తెచ్చుకున్న రోహిత్ అనూహ్యంగా హౌస్ నుంచి బయటకు వెళ్లాల్సి వచ్చింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియలో భాగంగా నాగార్జున ఆర్కే, శ్వేత, రోహిత్‌లను డేంజర్ జోన్‌లో ఉన్నట్లు ప్రకటించారు. అయితే ఈసారి ప్రేక్షకుల ఓటింగ్ కాకుండా హౌస్ సభ్యుల ఓటింగ్ (హౌస్‌మేట్స్ నిర్ణయం) కీలకంగా మారింది. ఇతరులు హౌస్‌లో కొనసాగకూడదని భావించే కంటెస్టెంట్ బొమ్మను పగలగొట్టి తమ అభిప్రాయాన్ని చెప్పాలని బిగ్‌బాస్ సూచించారు.
ఈ ఓటింగ్ ప్రక్రియలో నరేశ్, రామ్ ప్రసాద్, త్రిగుణ్, దెబ్జానీ, అమన్ తదితరులు రోహిత్‌కు వ్యతిరేకంగా ఓట్లు వేశారు. ముఖ్యంగా రోహిత్ మాట్లాడిన కొన్ని మాటల వీడియోలను బిగ్‌బాస్ చూపించడంతో త్రిగుణ్‌తో పాటు మిగతా సభ్యులు అతనికి వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నారు. తనను నమ్మినవారే తనకు వ్యతిరేకంగా ఓటు వేయడంతో రోహిత్ తీవ్ర ఆశ్చర్యానికి గురయ్యారు.
చివరకు హౌస్‌మేట్స్ నుంచి ఎక్కువ ఓట్లు రావడంతో రోహిత్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున అధికారికంగా ప్రకటించారు. బలమైన కంటెస్టెంట్‌గా పేరు తెచ్చుకున్న రోహిత్ ఇలా హౌస్‌మేట్స్ ఓటింగ్ ద్వారా హౌస్ నుంచి బయటికి వెళ్లడం బుల్లితెర ప్రేక్షకులను విస్మయానికి గురిచేసింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:





























