వాయిదాపడిన హతః .. త్వరలోనే కొత్త డేట్

hatah release postponed

యువ హీరో కిరణ్ అబ్బవరం నిర్మించి, సమర్పిస్తున్న సస్పెన్స్ అండ్ మిస్టికల్ థ్రిల్లర్ ‘హతః’. కేఏ ప్రొడక్షన్స్ మరియు పౌర్ణమి ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అనుష్ గోరక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో తనూజ పుట్టుస్వామి, రెహమాన్, కుష్లు, నమ్రిత కీలక పాత్రల్లో నటించారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ చిత్రం విడుదల వాయిదా పడినట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ప్రేక్షకులకు థియేటర్లలో మెరుగైన ఆడియా అండ్ విజువల్ అనుభవాన్ని అందించడంతో పాటు, ప్రస్తుతం థియేటర్ల వద్ద ఉన్న పోటీని దృష్టిలో ఉంచుకుని విడుదల తేదీని మార్చినట్లు చిత్రబృందం తెలిపింది.

“ఎ న్యూ డేట్.. ఎ బెటర్ ఎక్స్‌పీరియన్స్” అంటూ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా స్పెషల్ నోట్‌ను విడుదల చేశారు. జేసిన్ జార్జ్ సంగీతం అందించిన ఈ సినిమా నూతన విడుదల తేదీని మేకర్స్ త్వరలోనే అధికారికంగా వెల్లడించనున్నారు.ఈసినిమాను నైజాం ,ఉత్తరాంధ్రలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు విడుదల చేస్తున్నారు.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.