మచ్ అవైటెడ్ సీక్వెల్ పుష్ప 2 ది రూల్ ట్రైలర్ కూడా ఇంకా రిలీజ్ కాకముందే ఈసినిమా యూఎస్ఏ లో అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అదరగొడుతుంది.ఇప్పటివరకు అక్కడ ప్రీమియర్స్ ప్రీ సేల్స్ 500k డాలర్లను క్రాస్ చేశాయి.విడుదలకు ఇంకా 28 రోజులు వున్నా ఫాస్ట్ గా ఈ ఫీట్ సాధించిన మొదటి సినిమా గా పుష్ప 2 రికార్డు క్రియేట్ చేసింది.ఈ బుకింగ్స్ చూస్తేనే అర్ధమవుతుంది పుష్ప 2 కి అక్కడ ఏ రేంజ్ క్రేజ్ వుందో.కేవలం ప్రీమియర్స్ తోనే 2మిలియన్ మార్క్ ను క్రాస్ చేసేలా వుంది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
మరోవైపు పుష్ప 2 పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.వారం రోజుల షూటింగ్ కూడా బ్యాలెన్స్ వుంది. ఓ స్పెషల్ సాంగ్ ను చిత్రీకరించాల్సి వుంది. ఈనెల 20న ఫస్ట్ కాపీ రెడీ అయ్యేలా చూస్తున్నారు.త్వరలోనే ట్రైలర్ ను వదలనున్నారు.ఇక ప్రీ రిలీజ్ బిజినెస్ పరంగా పుష్ప 2 సరికొత్త రికార్డు సృష్టించింది.థియేట్రికల్ ,నాన్ థియేట్రికల్ కలుపుకొని మొత్తం 1000 కోట్లకు పైగా బిజినెస్ చేసింది.
నాన్ థియేట్రికల్ రూపంలో 420కోట్ల బిజినెస్ చేసినట్లు ఇంతకుముందు నిర్మాతలు ప్రకటించారు.ఇప్పటివరకు ఇదే హైయెస్ట్.థియేట్రికల్ రూపంలో మరో 600కోట్లకు పైగా బిజినెస్ జరిగింది. దాంతో 1000కోట్లకు పైగా బిజినెస్ చేసిన మొదటి ఇండియన్ సినిమాగా పుష్ప 2 ఆల్ టైం రికార్డు క్రియేట్ చేసింది.బ్రేక్ ఈవెన్ కావాలంటే 1000 కోట్లకు పైనే రాబట్టాల్సివుంటుంది.ఈసినిమాకు వున్న హైప్ కి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే టార్గెట్ చేరుకోవడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ టైటిల్ రోల్ లో నటిస్తున్న ఈసినిమాను సుకుమార్ తెరకెక్కిస్తుండగా రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు.మైత్రి మూవీ మేకర్స్ ,సుకుమార్ రైటింగ్స్ నిర్మిస్తున్నాయి.డిసెంబర్ 5న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: