డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఎనర్జిటిక్ హీరో రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఇస్మార్ట్ శంకర్. ఈసినిమా ఎంత ఘన విజయం సాధించిందో చూశాం. పూరీ డైలాగ్స్ కు రామ్ నటన తోడవ్వడం దానికిి తోడు మ్యూజిక్ కూడా కలిసిరావడంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. ఇక ఇప్పుడు ఇస్మార్ట్ శంకర్ 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం అయితే షూటింగ్ ను పూర్తి చేసే పనిలో ఉన్నారు చిత్రబృందం.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక తాజాగా ఈసినిమా టీజర్ గురించి క్రేజీ అప్ డేట్ ఇచ్చాడు ఆకాష్ పూరీ. ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆకాష్ పూరీ డబుల్ ఇస్మార్ట్ ఈసినిమా టీజర్ గురించి మాట్లాడుతూ.. రీసెంట్ గానే ఈసినిమా టీజర్ కట్ చూశాను చాలా బాగుంది. రామ్ ఫ్యాన్స్ మాత్రం హ్యాపీగా ఫీలయ్యేలా టీజర్ ఉంటుంది అని అన్నారు. ఇక ఇప్పుడు ఆకాష్ పూరీ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాదు రామ్ ఫ్యాన్స్ కూడా టీజర్ కోసం వెయిట్ చేస్తున్నారు.
కాగా ఈసినిమాలో ఇంకా బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.
ఈసినిమాను పూరి కనెక్ట్స్ పై పూరీ జగన్నాథ్, ఛార్మి కలిసి నిర్మించనున్నారు. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం మరియు హిందీ భాషల్లో కూడా ఈసినిమా విడుదల కానుంది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: