అసిస్టెంట్‌ బర్త్ డే సెలబ్రేట్ చేసిన నాగచైతన్య

Naga Chaitanya Celebrated His Personal Assistant Venky's Birthday on Thandel Sets

టాలీవుడ్ యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్‍గా నటిస్తున్నారు. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఫై బన్నీ వాస్ ఈ సినిమాను నిర్మిస్తుండగా.. అల్లు అరవింద్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు శ్యామ్ దత్ సినిమాటోగ్రఫి అందిస్తున్నాడు. ఇక ఈ మోస్ట్ అవైటెడ్ ప్రాజెక్టులో నాగచైతన్య తొలిసారి మత్స్యకారుడిగా ఒక వైవిధ్యభరితమైన పాత్రలో కనిపిస్తున్నారు. మొదటిసారి ఇలాంటి క్యారక్టర్‌లో కనిపించనుండటంతో చైతన్య కూడా దీనిని ఛాలెంజ్‌గా తీసుకుని నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఈ మేరకు ‘తండేల్’ నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ప్రచార చిత్రాలను గమనిస్తే.. మత్స్యకారుడి పాత్రకు తగట్టుగా ఆయన మేకోవర్ అయిన వైనం అర్ధమవుతుంది. ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటోంది. ఈ నేపథ్యంలో తాజాగా తండేల్ సెట్స్‌లో ఒక అరుదైన దృశ్యం కనిపించింది. తన పర్సనల్ అసిస్టెంట్‌ జన్మదిన వేడుకలను ఘనంగా జరిపించారు నాగచైతన్య. వెంకీ కొంకిపూడి అనే అతను నాగచైతన్య వద్ద పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న విషయం ఆయన అభిమానులతో పాటు సినీ ప్రియులకు తెలిసిందే.

ఈ సందర్భంగా ఆదివారం వెంకీ జన్మదినం కావడంతో.. షూటింగ్ విరామ సమయంలో చైతన్య ఒక కేకును తెప్పించి వెంకీతో కట్ చేయించారు. అనంతరం అతనికి బర్త్ డే విషెస్ చెప్పి కేకును తినిపించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ చందూ మొండేటి, హీరోయిన్ సాయి పల్లవి మరియు ఇతర యూనిట్ సభ్యులు కూడా వెంకీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియో నెట్టింట వైరల్ కాగా.. ఇలా తన పర్సనల్ అసిస్టెంట్‌ జన్మదిన వేడుకలను అందరిముందు ఘనంగా జరిపిన నాగచైతన్య నిజమైన హీరో అని పలువురు నెటిజెన్లు కామెంట్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు :
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × 2 =