ఆర్ఎక్స్ 100, మంగళవారం చిత్రాలతో భారీ బ్లాక్‌బస్టర్స్ ను అందించిన దర్శకుడు అజయ్ భూపతి, జయ కృష్ణ ఘట్టమనేనిని తెలుగు చిత్రసీమకు పరిచయం చేస్తూ ‘శ్రీనివాస మంగాపురం’ తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంతో బాలీవుడ్ నటి రవీనా టాండన్ కుమార్తె రాషా తడాని తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. సీనియర్ నటుడు మోహన్ బాబు పవర్ ఫుల్ విలన్ పాత్రలో నటిస్తున్నారు. పి. కిరణ్ నిర్మించి నిర్మాణంలో అశ్వినీ దత్ సమర్పిస్తున్న ఈ చిత్రం నుంచి సూపర్‌స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా యాక్షన్ టీజర్‌ను విడుదల చేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమా పాత్రలు, ప్రపంచాన్ని పరిచయం చేయగా, తాజా టీజర్ మాత్రం పూర్తిగా యాక్షన్, ఆటిట్యూడ్‌తో ఆకట్టుకుంది. జయకృష్ణ ఘట్టమనేని కాన్ఫిడడెంట్ గా విలన్స్ ని సవాల్ చేస్తూ, భారీ యాక్షన్ సన్నివేశాల్లో అలరించారు. టీజర్ చివర్లో సూపర్ స్టార్ కృష్ణకు నివాళిగా రూపొందించిన సన్నివేశం ప్రత్యేక ఆకర్షణగా నిలిచి, భావోద్వేగాన్ని పెంచింది.
ఈ టీజర్‌తో జయకృష్ణను మాస్ యాక్షన్ హీరోగా ప్రజెంట్ చేశారు. ఆయన ఫిజిక్, అగ్రెసివ్ బాడీ లాంగ్వేజ్, యాక్షన్ సీక్వెన్స్‌లలో చూపిన ఈజ్ ప్రత్యేకంగా ఆకట్టుకుంటాయి. రా అండ్ రగ్డ్ లుక్ ఆయన స్క్రీన్ ప్రెజెన్స్‌ను మరింత బలంగా నిలబెట్టింది.
అజయ్ భూపతి ఓ కమర్షియల్ ఎంటర్టైనర్కు కావాల్సిన అన్ని అంశాలను ఈ చిత్రంలో జోడించినట్లు టీజర్ ద్వారా స్పష్టమవుతోంది. భారీ స్థాయిలో తెరకెక్కించిన యాక్షన్ ఎపిసోడ్స్‌కు సినిమాటోగ్రాఫర్ జయకృష్ణ ISC అందించిన విజువల్స్ మరింత గ్రాండియర్ తీసుకొచ్చాయి. జీవీ ప్రకాష్ కుమార్ అందించిన ఎనర్జిటిక్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ టీజర్‌ను మరో స్థాయికి తీసుకెళ్లింది.
ఈ చిత్రానికి మాధవ్ కుమార్ గుల్లపల్లి ఎడిటర్‌గా, సాహి సురేష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, రియల్ సతీష్ యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్నారు.‘శ్రీనివాస మంగాపురం’ విడుదల తేదీని త్వరలో ప్రకటించనున్నారు.
ఆన్లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























