పెద్ది రిలీజ్ వేళ తిరుమలలో జాన్వీ కపూర్

Ahead of Peddi Release Janhvi Kapoor Seeks Blessings at Tirumala

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ సరసన నటించిన ‘పెద్ది’ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదలై థియేటర్లలో పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలోనే చిత్ర కథానాయిక, బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సినిమాకు వస్తున్న రెస్పాన్స్ పట్ల కృతజ్ఞత తెలుపుకుంటూ, ‘పెద్ది’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం సాధించాలని కోరుకుంటూ ఆమె ఈ ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. విఐపి బ్రేక్ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు.రంగనాయకుల మండపంలో వేద పండితులు జాన్వీ కపూర్‌కు ఆశీర్వచనం పలకగా, ఆలయ అధికారులు స్వామి వారి తీర్థప్రసాదాలు, పట్టువస్త్రాన్ని అందజేశారు.

జాన్వీ కపూర్ తిరుమలకు వచ్చారనే విషయం తెలుసుకున్న స్థానిక భక్తులు, మెగా అభిమానులు ఆమెను చూసేందుకు, సెల్ఫీల కోసం ఎగబడ్డారు. ఆలయ భద్రతా సిబ్బంది ఆమెను సురక్షితంగా కారు వరకు పంపించారు.

జాన్వీ కపూర్‌కు తిరుమల శ్రీవారంటే అత్యంత భక్తి. తన తల్లి, దివంగత నటి శ్రీదేవి సెంటిమెంట్‌ను ఫాలో అవుతూ ఆమె ప్రతి పుట్టినరోజుకు, అలాగే తన ప్రతి కొత్త సినిమా రిలీజ్ సమయంలోనూ ఖచ్చితంగా తిరుమల కొండకు కాలినడకన లేదా వీఐపీ దర్శనం ద్వారా వస్తుంటారు. ‘పెద్ది’ సినిమాలో ఆమె పోషించిన అచ్చియమ్మ పాత్రకు థియేటర్లలో ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది.

ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇

తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్ద్ ఫిలిమ్స్

x

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.