రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’ ప్రీ-రిలీజ్ వేడుక నిన్న విజయవాడలో అత్యంత వైభవంగా జరిగింది. ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించిన బాలీవుడ్ బ్యూటీ, అతిలోకసుందరి శ్రీదేవి తనయ జాన్వీ కపూర్ ఈ ఈవెంట్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఈ వేడుకలో జాన్వీ కపూర్ తెలుగులో మాట్లాడి ఆశ్ఛర్యపరిచింది. స్టేజ్‌పైకి రాగానే తెలుగు ప్రేక్షకులు చూపిస్తున్న ప్రేమాభిమానాలకు జాన్వీ ఎమోషనల్ అయింది. మీరు చూపిస్తున్న ఇంతటి ప్రేమాభిమానాలకు నేను చాలా థ్రిల్ అయ్యాను. ప్రేక్షకులు దేవుళ్లతో సమానమని మా అమ్మ శ్రీదేవి నాకు ఎప్పుడూ చెప్పేది. ఆమె చెప్పిన మాట ఎంత నిజమో ఈరోజు మీ ప్రేమని చూస్తుంటే అర్థమవుతోంది అని తెలుగులో మాట్లాడి అందరినీ ఫిదా చేసింది.
ఈవెంట్‌లో హోస్ట్ సుమ అడగడంతో.. తన తల్లి శ్రీదేవి నటించిన ఆల్‌టైమ్ క్లాసిక్ హిస్టారికల్ మూవీ ‘జగదేకవీరుడు అతిలోకసుందరి’ లోని ఐకానిక్ డైలాగ్‌ను జాన్వీ స్టేజ్‌పై రీక్రియేట్ చేసింది. తనదైన క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్‌తో “మానవా.. మానవా..” అంటూ ఆమె చెప్పిన డైలాగ్‌కు స్టేడియం మొత్తం చప్పట్లు, ఈలలతో దద్దరిల్లిపోయింది.
రామ్ చరణ్‌తో కలిసి నటించడంపై స్పందిస్తూ.. “రామ్ చరణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా గర్వంగా ఉంది. ఆయన ఒక గ్రేట్ యాక్టర్ మాత్రమే కాదు, ఎక్సలెంట్ హ్యూమన్ బీయింగ్. ‘పెద్ది’ అనేది ఒక మనిషి తన జీవిత పరమార్థాన్ని ఎలా వెతుక్కున్నాడనే ఒక స్పెషల్ జర్నీ. థియేటర్లలో ఈ సినిమా మీకు ఒక గ్రాండ్ ఎక్స్‌పీరియన్స్ ఇస్తుంది. ఈసారి మీరు నన్ను కొంచెం ఎక్కువగానే ప్రేమిస్తారు” అంటూ మురిపించింది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:



























