రామ్ చరణ్, బుచ్చిబాబు సానా కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా మూవీ ‘పెద్ది’. జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతున్న నేపథ్యంలో, నిన్న విజయవాడలో జరిగిన ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో సీనియర్ నటుడు జగపతి బాబు చేసిన వ్యాఖ్యలు ట్రేడ్ వర్గాల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
సినిమా సక్సెస్‌పైనే కాకుండా, ప్రస్తుతం థియేటర్ రంగం ఉన్న పరిస్థితులను విశ్లేషిస్తూ జగపతి బాబు చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.
ఇటీవల సంక్రాంతి సీజన్ తర్వాత టాలీవుడ్‌లో ఆశించిన స్థాయిలో కమర్షియల్ విజయాలు లేకపోవడంతో థియేటర్ రంగం కొంత ఒలిక ఒత్తిడిని ఎదుర్కొంటోందని జగపతి బాబు పేర్కొన్నారు. అలాంటి సమయంలో పెద్ది లాంటి భారీ చిత్రం బాక్సాఫీస్‌కు కొత్త జోష్ తీసుకురావడం ఖాయమని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
ఈ సినిమా కేవలం ఒక హిట్ చిత్రంగానే కాకుండా.. మొత్తం టాలీవుడ్ ఇండస్ట్రీకి, ముఖ్యంగా నష్టాల్లో ఉన్న డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు ఒక పెద్ద దిక్కుగా మారుతుందని జగపతి బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయని, ప్రేక్షకులు ఒక మంచి థియేట్రికల్ అనుభవం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారని ఆయన తెలిపారు.
దర్శకుడు బుచ్చిబాబు సన ఈ చిత్రాన్ని ఎంతో ఎమోషన్, ఇంటెన్సిటీతో తెరకెక్కించారని.. రామ్ చరణ్ కెరీర్‌లోనే ఇది ఒక మైండ్ బ్లోయింగ్ అండ్ ప్రత్యేక చిత్రంగా నిలిచిపోతుందని జగపతి బాబు అభిప్రాయపడ్డారు.
ఈసినిమాలో జగపతి బాబు, అప్పలసూరి అనే పాత్రలో కనిపించనున్నారు. అరవింద సమేత తరువాత మళ్ళీ మంచి క్యారెక్టర్ దొరికిందని పెద్దితో నా 8 ఏళ్ళ ఆకలి కూడా తీరుతుందని ఈవెంట్ లో జగపతి బాబు చెప్పుకొచ్చారు.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
x




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























